రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాలలో సైన్స్ విభాగంలో సీనియర్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పి.అనురాధ చౌదరిని ప్రధానోపాధ్యాయురాలు మమిత ప్రధాన్ లైంగిక వేధిపులు చేస్తున్నారనే ఆరోపణలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యామాల్లో వైరల్ కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. తనపై తరచూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. ఆమె వేధింపులు తట్టుకోలేక అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైరల్ అయిన వీడియా అధికారుల దృష్టికి వచ్చింది. ఈ ఘటన ఈ నెల 24వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన ఉపాధ్యాయురాలు చౌదరి ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి తగిన న్యాయం చేయాలని ఆమె కోరింది. గత 20 ఏళ్లుగా సైన్ టీచర్‌గా అనుభవం ఉన్న తాను గత ఏడాదిగా గొవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న మమిత ప్రధాన్ ఎటువంటి తప్పు లేకపొయినప్పటికీ తనపై దురుసుగా ప్రవర్తిండంతోపాటు మానసికఒత్తిడి కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 24న తాను క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న సమయంలో వెంటనే తనని చాంబర్‌కు రమ్మని పిలిచారని ఆమె ఆదేశానుసారం వెంటనే తాను ప్రధానోపాధ్యాయురాలి చాంబర్‌కు వెళ్లగా తనపై లేనిపోని మాటలతో బాధకలిగించారని వీడియోలో వివరించారు. అనంతరం తాను తరగతిలో పాఠాలు చెప్పడానికి వెళ్లినప్పటికీ ఒత్తిడి వల్ల పాఠాలు నిలిపివేసి విశ్రాంతి తీసుకునేందుకు టీచర్స్ కామన్ రూంకు వెళ్లి అక్కడ కళ్లు తిరిగి ఆపస్మారక స్థితిలో పడిపోయినట్లుగా వివరించారు. సిబ్బంది తనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారని వివరించారు. ఉపాధ్యాయులపై ఇటువంటి మానసిక వత్తిడి కలిగేలా ప్రధానోపాధ్యాయురాలు ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని కోరారు.


