వందేభారత్‌ను కొరాపుట్ వరకు పొడిగించండి
కొరాపుట్: వందేభారత్ రైలును విశాఖపట్నం నుంచి కొరాపుట్‌కు పొడిగించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క డిమాండ్ చేశారు. బుధవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా ఆయన మాట్లాడుతూ కొరాపుట్ నుంచి భువనేశ్వర్‌కు పగటి పూట రైలు కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం భువనేశ్వర్–విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్‌ను కొరాపుట్ వరకు పొడిగించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రాయగడ రైల్వే డివిజన్‌కు పూర్తి సౌకర్యాలు కల్పించాలన్నారు. డివిజన్‌లో అత్యధిక కార్యకలాపాలు విశాఖ రైల్వే డివిజన్‌లోనే కొనసాగుతున్నాయని ఎంపీ గుర్తు చేశారు.


