రాయగడ: ఆదివాసీ నాయకురాలు, జిల్లా బాలల సంక్షేమ కేంద్రం అధ్యక్షురాలుగా పనిచేస్తూ విధుల నుంచి తొలగింపునకు గురైన బిద్యులత హుయిక హైకోర్టు ఆదేశాలతో తిరిగి విధుల్లోకి చేరారు. జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించే ఫరూల్ పట్వారి (గత కలెక్టర్) అనివార్య కారణాలను చూపించి బిద్యులతను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అయితే బిద్యులత తనకు న్యాయం చేకూర్చాలని హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న కోర్టు బిద్యులత హుయికకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. మళ్లీ ఆమెను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆమె విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
డీఐపీఆర్వో బాధ్యతల స్వీకరణ
రాయగడ: సబ్ డివిజనల్ పౌరసంబంధాల శాఖ అధికారిగా దేవరాజ్ టక్రి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో ఈ మేరకు బాధ్యతలు స్వీకరించగా జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, మాజీ డీఐపీఆర్వో జలంధర్ పుసిక, సిబ్బంది అభినందించి స్వాగతం పలికారు.
యువకుడి బలవన్మరణం!
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి కొరప పంచాయతీలోని శిలిపొదొరో గ్రామంలో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మృతుడు సేన్ లోయా కొడుకు భవాణీ లోయ(35)గా గుర్తించారు. గ్రామంలోని నిమ్మచెట్టుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏనుగు దాడిలో వ్యక్తికి గాయాలు
రాయగడ: ఏనుగు దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీ పరిధి బుడుని గ్రామంలో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు బాలా సికక ఉదయం కొండపై ఉన్న తన పంట పోలంో పనులు చేస్తున్న సమయంలో ఏనుగు అతనిపై హఠాత్తుగా దాడి చేయడంతో గాయపడ్డాడు. సమీపంలో ఉన్న వారు చూసి ఏనుగును తరిమారు. గాయాలతో ఉన్న సికకను కళ్యాణసింగుపూర్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి రిఫర్ చేశారు. ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
15 కేజీల గంజాయి పట్టివేత
జయపురం: బైక్‌పై అక్రమంగా రవాణా చేస్తున్న 15 కేజీల గంజాయిని బొయిపరిగుడ అబ్కారి సిబ్బంది పట్టుకున్నారు. చిపాకూర్ గ్రామానికి చెందిన యువకుడిని అరెస్టు చేసినట్లు బొయిపరిగుడ అబ్కారి విభాగ అధికారి భగవాన్ మహానందియ తెలిపారు.
విధుల్లోకి బిద్యులత హుయిక
విధుల్లోకి బిద్యులత హుయిక
విధుల్లోకి బిద్యులత హుయిక
విధుల్లోకి బిద్యులత హుయిక


