దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయం
రాయగడ: దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా సామాజికి సురక్షా విభాగం నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. హెలెన్ కెల్లర్, లిక్ బ్రూజిక్, జెస్సీకా క్రబ్, అరుణిమా సిన్హా, దీప మాలిక్ వంటి ప్రముఖులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్రనాయక్ మాట్లాడుతూ దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా ఆపద సమయంలో అండగా నిలవాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఏడుగురు దివ్యాంగులకు రూ.2.50 లక్షలను పెళ్లి కానుకగా అందజేశారు. అంతకుముందు మున్సిపాలిటీ కార్యాలయం నుంచి దివ్యాంగులు ర్యాలీ నిర్వహించారు. వివిధ సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాయగడ మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్, వైస్ చైర్మన్ శుభ్ర పండా, బీడీఓ సుజిత్‌కుమార్ మిశ్రా, సమితి వైస్‌చైర్మన్ హరప్రసాద్ హెప్రుక, రాయగడ దివ్యాంగుల మహాసంఘం అధ్యక్షుడు శిశిర్ కుమార్ రావుల్, సాధారణ కార్యదర్శి అమరేంద్రనాథ్, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి శ్రీకాంత్ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయం
దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయం


