కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
జయపురం: కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యమని జిల్లా కమిటీ అధ్యక్షుడు రూపక్ తురుక్ అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు జయపురంలో గల జిల్లా కాంగ్రెస్ భవనంలో శనివారం జాతీయ ప్రతిభా అన్వేషణ సమావేశం నిర్వహించారు. సీనియర్ కాంగ్రేస్ నేత నిహారంజన్ బిశాయి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కాంత పాదీ, జయపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత నాయక్, మల్కనగిరి మాజీ ఎమ్మెల్యే నిమయ్ చరన సర్కార్, బ్రజ నాగ్, జిల్లా యూత్ కాంగ్రెస్ నేత టిను రావు, సను దండసేన, జిల్లా అల్ప వర్గాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హపన్ మదాని, ప్రనభ నాయక్, తదితరులు హాజరయ్యారు. ప్రతిభావంతులైన యువతకు పార్టీ చరిత్ర, ఆదర్శాలు, పార్టీ ఆలోచన ధార, ఉత్తమ భాషాజ్ఞానం, రాజనైతిక సచేతన, చరిత్రపై జ్ఞానం ప్రతిభ గల యువతీ, యువకుల కోసం అన్వేషణ జరుగుతోందని, అటువంటి వారినుంచి పత్రాలు ఆహ్వానించటం జరుగుతుందన్నారు. డిసెంబర్ 3వ తేదీన ఆవేదన పత్రాలను పరిశీలించటం జరుగుతుందని వెల్లడించారు. డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు ప్రాంతీయ స్థాయిలో వ్యక్తగత సాక్షాత్కారం ఉంటుందని, 14న రాష్ట్ర స్థాయిలో ఆవేదన పత్రాలు ఇచ్చిన వారితో రాష్ట్ర పార్టీ నేతలతో కలిసే కార్యక్రమం ఉంటుందన్నారు.


