మన కర్తవ్యం
రాజ్యాంగ విలువల నిబద్ధత..
భువనేశ్వర్:
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ స్ఫూర్తి మార్గనిర్దేశంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి పిలుపునిచ్చారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం రాజ్యాంగ విలువల పట్ల సమష్టి నిబద్ధతను కర్తవ్య దీక్షగా స్వీకరించి ముందుకు సాగుదామని ప్రోత్సహించారు. రాజ్ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన నిరాడంబర కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి రాజ్యాంగ విలువల నిబద్ధతతో కొనసాగుతామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకు శాసన సభ స్పీకర్ సురమా పాఢి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఇతర సీనియర్ మంత్రులు, శాసన సభ్యులు శాసన సభ భవనంలో రాజ్యాంగ ప్రతిజ్ఞను పఠించారు. తూర్పు కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం రైల్వే సదన్ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి, మండల రైల్వే అధికారులు (డీఆర్‌ఎం) ఆధ్వర్యంలో మండల స్థాయి భారత రాజ్యాంగ దినత్సోవం కార్యక్రమం నిర్వహించారు. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని మండలాలు, రైల్వే స్టేషన్లలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
మన కర్తవ్యం
మన కర్తవ్యం


