గురుకుల పాఠశాల తనిఖీ
పాతపట్నం: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల, కళాశాలల అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్‌కుమార్ అన్నారు. పాతపట్నం మండలం ప్రహరాజపాలెంలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను మంగళవారం గురుకులాల సమన్వయాధికారి వై.యశోదలక్ష్మితో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థుల భోజనం, వంటగది, స్టోర్‌రూమ్, డార్మిటరీలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గిరిజనుల బతుకులు బూడిద చేయవద్దు
సరుబుజ్జిలి: థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మించి గిరిజనుల బతుకులు బూడిద చేయవద్దని థర్మల్ వ్యతిరేక పోరాటకమిటీ కన్వీనర్ సురేష్‌దొర, కోశాధికారి అత్తులూరి రవికాంత్ అన్నారు.వెన్నెలవలసలో మంగళవారం థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో థర్మల్ వ్యతిరేక పోస్టర్లను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులపై ఏమాత్రం ప్రేమ ఉన్న ప్రభుత్వం వెంటనే థర్మల్‌ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో పోరాట కమిటీ కార్యదర్శి సమర సింహాచలం, పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు.
థర్మల్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోవాలి
ఆమదాలవలస: సరుబుజ్జిలి, బూర్జ మండలాల ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కోనారి మోహనరావు డిమాండ్‌చేశారు. మంగళవారం ఆమదాలవలస పట్టణంలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం పెన్షన్ల పంపిణీకి సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలోని ఆదివాసీల గ్రామాలకు వెళ్లి ప్లాంట్ ఏర్పాటుపై కాగితాలు ఏమైనా ఉంటే చూపెట్టాలని స్థానికులను అడగడం సిగ్గుచేటన్నారు. ప్లాంట్ నిర్మించబోమని చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందన్నారు. ప్లాంట్ నిర్మిస్తున్నట్లు తనకు తెలియదని చెప్పడం కంటే ఈ ప్రాంతంలో నిర్మించడం లేదని చెబితే బాగుండేదన్నారు. ప్రాజెక్టును స్థానికులు వ్యతిరేకిస్తుంటే ఎందుకు ముందుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికై నా పాలకులు తీరు మారకపోతే భవిష్యత్తు ఉద్యమానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ వికాస పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, సీపీఐ కార్యదర్శి చాపర సుందర్‌లాల్, థర్మల్ పోరాట కమిటీ కోశాధికారి అత్తులూరి రవికాంత్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సవర లక్ష్మణరావు, అఖిలభారత యువజన సంఘం అధ్యక్షులు బొత్స సంతోష్‌కుమార్, థర్మల్ పోరాట కమిటీ సభ్యులు సవర సింహాచలం, కునారి మనోజ్, సవర సింగయ్య ,నగేష్ తదితరులు పాల్గొన్నారు.
కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతి
పొందూరు: కొంచాడ గ్రామంలో కుక్కల దాడిలో మంగళవారం సుమారు 40 గొర్రె పిల్లలు మృతి చెందాయి. అన్నదమ్ములు కురమాన రమణ, కురమాన గౌరినాయుడులు తమ శాలలో 40 గొర్రె పిల్లలు ఉంచారు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా కుక్కల గుంపు చొరబడి దాడిచేసి చంపేశాయి. స్థానికులు వచ్చి తరిమికొట్టేలోపే గొర్రె పిల్లలన్నీ మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. మృతిచెందిన గొర్రె పిల్లలకు పెనుబర్తి పశువైద్యాధికారి హేమంత్ పోస్టుమార్టం నిర్వహించారు.
గురుకుల పాఠశాల తనిఖీ
గురుకుల పాఠశాల తనిఖీ
గురుకుల పాఠశాల తనిఖీ


