కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం!
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుసాని బ్లాక్ మహాదావ్ పూర్ గ్రామానికి చెందిన మహిళ మానస జెన్నా గ్రామంలోని ప్రశాంత్ డాలోకు రూ. 3.77 లక్షలు అప్పుకింది కోద్దిరోజుల క్రితం అందజేసింది. ఈ రుణం ఇచ్చినట్టు ఒక కాగితంపై ప్రామిసరీ నోట్‌ను కూడా మానస రాసుకున్నది. అయితే అప్పు తీసుకున్న ప్రశాంత్ పాముకాటుతో ఇటీవల మరణించాడు. తీసుకున్న అప్పును మృతుడు కోడుకు జగదీష్ డోలో ఇవ్వాలని కోరగా అందుకు ఆతడు తీర్చుతానని హామీ ఇచ్చాడు. కానీ చాలారోజులుగా మానస జెన్నాకు తిప్పుతూ చివరికి అప్పును ఇవ్వనని మొండికేయడంతో..చేసేది లేక ఆమె గురండి పోలీసుస్టేషన్ అధికారి ఓంనారాయణ పాత్రోకు ఫిర్యాదు చేసింది. అయితే గురండి పోలీసు ష్టేషన్ అధికారి ఆమెతో అసభ్యంగా మాట్లాడడంతో పాటు ఆమె లొంగుబాటుకు ప్రోత్సాహించాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లగా ఆయన సెలవు మీద ఉండటంతో తిరిగి పర్లాకిమిడి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లినప్పటికీ అక్కడి అధికారి ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును ఆదనపు ఎస్పీ స్వీకరించారు. అయితే వెనువెంటనే మానసజెన్నా కలెక్టరేట్ హాలు బయట తన చీరకొంగుతో ఆత్మహత్యాయత్నం చేయగా ఆదనపు ఎస్పీ సునీల్ మహాంతి వారించి సబ్ డివిజనల్ పోలీసు అధికారితో ప్రత్యేకంగా విచారించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆమె వెళ్లిపోయింది.
కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం!


