తూర్పు కోస్తా రైల్వే ప్రేమ్ సమావేశం
భువనేశ్వర్: నిర్వహణలో ఉద్యోగుల భాగస్వామ్య సమావేశం (ప్రేమ్) ప్రధాన కార్యాలయం రైల్ సదన్‌లో జరిగింది. జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ అధ్యక్షతన మంగళ వారం జరిగిన ఈ సమావేశానికి జోనల్ స్థాయిలో పలు విభాగాల ఉన్నతాధికారులు, గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు, వివిధ రైల్వే సిబ్బంది సంఘాల ప్రతినిధులు హాజరై ముఖాముఖి సంప్రదింపుల్లో పాలుపంచుకున్నారు. గమ్యాన్ని ప్రోత్సహించే చొరవలో భాగంగా సామరస్యపూర్వకమైన, నిర్మాణాత్మక పారిశ్రామిక సంబంధాలను పెంపొందించే సంప్రదాయంలో భాగంగా భారతీయ రైల్వే సిబ్బంది భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. రైల్వే కార్యకలాపాల్లో సమష్టి ప్రయత్నాలతో మెరుగైన ఫలితాల సాధనకు ఈ సంప్రదాయం దోహదపడుతుందని జనరల్ మేనేజరు అభిప్రాయపడ్డారు.


