
కూర్మావతారంలో జగన్నాథుడి దర్శనం
రాయగడ: స్థానిక గుండిచా మందిరంలో కొలువుదీరి పూజలందుకుంటున్న జగన్నాథుడు సోమవారం కూర్మావతారంలొ భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి వారి దర్శనభాగ్యం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. జిల్లాలోని బిసంకటక్‌లో కూడా జగన్నాథ రథాయాత్ర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గుండిచా మందిరంలో స్వామి వారు చెల్లెళ్లు శుభద్ర, సొదరుడు అగ్రజుడు బలభద్రుని సమీతంగా కూర్మావతారంలో దర్శనం ఇచ్చారు. అలాగే స్వామివారి అన్నప్రసాదం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. స్థానిక గుండిచా మందిరంలో అన్నభోగం కోసం 60 రూపాయల టిక్కెట్టు ధరను నిర్ణయించిన నిర్వాహకులు ఆవిధంగా అన్నభోగాలను విక్రయిస్తున్నారు. అయితే గంటల తరబడి భోగం కోసం పడికాపులు పడాల్సి వస్తుందని భక్తులు నిరాశ చెందుతున్నారు. పరిమతంగా టిక్కెట్లు విక్రయిస్తుండటంతో అందరికీ భోగం అందుబాటులో ఉండటం లేదు.

కూర్మావతారంలో జగన్నాథుడి దర్శనం

కూర్మావతారంలో జగన్నాథుడి దర్శనం