
ఘనంగా దేశాలమ్మతల్లి వార్షికోత్సవం
రాయగడ: సదరు సమితి పరిధి జేకేపూర్‌లోని బీసీ రోడ్డు వద్ద పూజలందుకుంటున్న దేశాలమ్మతల్లి అమ్మవారి వార్షిక జాతర ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యింది. మూడు రోజులు జరగనున్న యాత్రను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అమ్మవారి ఘటాలు కొలువుదీరాయి. రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు, మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరికలు సొమవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నెక్కంటికి ఉత్సవ కమిటీ సభ్యులు జె.రాజు, ఆర్.శంకరరావు, జి.శంకరరావు, పుండరీకాక్ష సభ్యులు స్వాగతం పలికి సన్మానించారు. మందిర అభివృద్ధిని చేసి అమ్మవారి జాతరను ఏటా ఘనంగా నిర్వహించి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా నెక్కంటి ఆకాంక్షించారు.

ఘనంగా దేశాలమ్మతల్లి వార్షికోత్సవం