
పరికరాలు ఉన్నా.. ప్రయోజనం సున్నా
● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో సమస్యల కొలువు
● వేధిస్తున్న స్టాఫ్ నర్సుల కొరత
టెక్కలి రూరల్:
స్థానిక జిల్లా కేంద్రాస్పత్రి సమస్యలతో కునారిల్లుతోంది. నిత్యం 700 వరకు ఓపీ ఉన్న ఈ ఆస్పత్రిలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ చర్మవ్యాధి నిపుణులు లేకపోవడంతో చాలా మంది ఇక్కట్లు పడున్నారు. ఆస్పత్రిలో ప్రధానంగా స్టాఫ్ నర్సుల కొరత వేధిస్తోంది. గత ప్రభుత్వంలో స్టాఫ్ నర్సులు 43 మంది ఉండగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 కంటే తక్కువ మందే పనిచేస్తున్నారు. దీంతో ట్రామాకేర్, గైనిక్ వార్డు, జనరల్ వార్డులు, ఆర్థో వార్డుల్లో రోగులకు సరైన సమయంలో వైద్యం అందించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ప్రధాన సమస్యలివే..
● ఆస్పత్రిలో రేడియోలజిస్టు లేక అల్ట్రా సౌండ్ స్కానింగ్ విభాగం మూతపడింది.
● రూ.లక్షలు విలువ గల వెంటిలేటర్లు ఉన్నా, వినియోగించేందుకు నిపుణులు లేక అవి కూడా మూలకు చేరాయి.
● రూ.లక్షలు విలువ గల హార్మోన్ ఎనలైజర్ యంత్రం ఉన్నా, దానికి సంబంధించిన రసాయనాలు లేక వినియోగంలో లేకుండా పోయింది.
● ఈసీజీ టెక్నీషియన్ లేకపోవడంతో ఉన్న సిబ్బందితో పూర్తిస్థాయి అవగాహన లేకుండా ఈసీజీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
● థైరాయిడ్ పరీక్షలకు సంబంఽధించిన యంత్రం ఉన్నా దానికి సంబంధించిన కెమికల్స్ లేకపోవడంతో థైరాయిడ్ పరీక్షలకు అక్కడ ఉన్న కొంతమంతి సిబ్బంది బయట ల్యాబ్‌లతో మాట్లాడి చేయిస్తున్న పరిస్థితి నెలకొంది.
● ట్రామాకేర్‌కు సంబంధించిన అంబులెన్స్ పాతజిల్లా ఆస్పత్రి ఆవరణలో మూలకు చేరింది.
● ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగి నెలలు గడుస్తున్నా నేటికీ నిర్వహించడం లేదు. దీంతో చాలా వరకు సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి.
● ఆస్పత్రికి పూర్తిస్థాయిలో దోబీ వర్కర్ లేకపోవడంతో శానిటేషన్ వర్కర్లతో పనిచేయిస్తున్నారు.
● ఆస్పత్రిలో సరిపడా వీల్‌చైర్లు, స్ట్రెచర్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
● ఆస్పత్రిలో ఉన్న లిఫ్ట్ తరుచూ పాడైపోతోంది.
● రోగులకు అవసరమైన తాగునీరు, వాడుకనీరు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు.
● కాలువ వ్యవస్థ కూడా సరిగా లేదు.
● ఫ్రీజర్లు సరిగా లేకపోవడంతో మృతదేహాలను కిందనే ఉంచాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
స్టాఫ్‌నర్సుల కొరత వాస్తవమే..
ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుల కొతర వాస్తవమే. 17 మంది తక్కువగా ఉన్నారు. బదిలీలు జరిగాక కొత్త వారు వస్తారు. థైరాయిడ్, వెంటిలేటర్ పరికరాలు త్వరలోనే వినియోగంలోకి తీసుకువస్తాం. – బొడ్డేపల్లి సూర్యారావు,
టెక్కలి జిల్లా ఆస్పత్రి సూపరిండెంటెంట్

పరికరాలు ఉన్నా.. ప్రయోజనం సున్నా