కాటేసే కాలం | - | Sakshi
Sakshi News home page

కాటేసే కాలం

Jun 13 2025 5:33 AM | Updated on Jun 13 2025 5:33 AM

కాటేస

కాటేసే కాలం

● ఖరీఫ్‌లో విషసర్పాలతో జాగ్రత్త ● వానాకాలంలో పాముల సంచారం ఎక్కువ

హిరమండలం: పొలం పనులు మొదలైపోయాయి. వానలు పడుతుండడంతో రైతులకు పొలాలకు వెళ్తున్నారు. అయితే ఈ కాలంలో రైతులు పాముకాటుకు గురవుతుంటారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఈ నెల నుంచి దాదాపు నవంబర్‌ వరకు పాములు, ఇతర విష కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించాలి

●పొలాల గట్లమీద వెళ్లేటప్పుడు కర్రచప్పుడు చేస్తూ నడవడం మంచిది.

●రాత్రిపూట పొలాలకు నీరు కట్టడానికి వెళ్లినప్పుడు టార్చిలైట్‌ తీసుకుని వెళ్లాలి.

●ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలి.

●పాము కాటు కంటే చాలామంది షాక్‌తోనే ప్రాణం మీదకు తెచ్చుకుంటారు. ●ఇంట్లో వారు ధైర్యం చెప్పాలి.

●పాముకాటు వేయగానే కొందరు ఆ గాయాన్ని మరింతగా కోస్తే రక్తం తో పాటు విషం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు అలా చేయకూడదు. ఒక్కోసారి పాము కాటుకన్నా ఈ ఆగాయం ప్రమాద కరంగా మారవచ్చు.

పాముకాటు లక్షణాలు

●పాము కాటు వేసిన ప్రదేశంలో రెండు కోరల గాయం స్పష్టంగా కనిపించి నొప్పి తీవ్రంగా ఉంటుంది.

●నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది.

●పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్టు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు అనిపిస్తాయి.

●కళ్లు మగతగా శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు

పాములు విషప్రభావం

కట్ల పాము: ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణా ల్లో కలుస్తుంది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి.

నాగుపాము: ఇది కాటేసిన 15 నిమిషాల్లో శరీరంలోకి విషం ఎక్కుతుంది.

రక్తపింజర : ఇది కాటేసిన రెండు గంటల తర్వాత విషం శరీరంలోకి ఎక్కుతుంది.

జెర్రిపోతు, నీరుకట్ట: ఇది కాటేసినా విషం ఉండదు. కానీ చికిత్స తీసుకోవడం అవసరం.

అందుబాటులో వ్యాక్సిన్‌

పాముకాటు బారిన పడిన వారికి పీహెచ్‌సీల్లో చికిత్స అందుబాటులో ఉంటుంది. వారికి కావాల్సిన యాంటీస్నేక్‌వీనం ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. పాటుకాటుకు గురైన వ్యక్తి ఆందోళన, భయం చెంద కుండా నిర్భయంగా ఉండాలి. గాయంపై భాగాన్ని వస్త్రంతో గట్టిగా లాగి కట్టి ఉంచాలి. వెంటనే ప్రథమ చికిత్స చేసి గాయాన్ని బట్టి రెండు సార్లు స్నేక్‌వీనం డోస్‌ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. పాము కరిచిన వెంటనే ఏదైనావాహనంలో ఆరోగ్య కేంద్రానికి చేర్చాలి. నడిపించకూడదు.

– ఫారుక్‌ హుస్సేన్‌, వైద్యాధికారి, పీహెచ్‌సీ, హిరమండలం

కాటేసే కాలం 1
1/2

కాటేసే కాలం

కాటేసే కాలం 2
2/2

కాటేసే కాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement