
నడుస్తున్న కారు దగ్ధం
కొరాపుట్: నడుస్తున్న కారు నుంచి అకస్మాత్తుగా మంటలు రేగడంతో కారు డ్రైవర్ రెప్పపాటులో తప్పించుకున్నాడు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం పోలీస్ స్టేషన్ పరిధి రాష్ట్ర రహదారి 39 పై ఆదర్శ విద్యాలయం ఎదుట ఒడి 08వి 3816 నంబర్ గల కారు దగ్ధమైంది. వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లడంతో ప్రమాదం జరిగి మంటలు రేగాయి. ఇది తెలిసి డాబుగాం నుంచి అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చారు. కలహండి జిల్లా బడపడా గ్రామానికి చెందిన బినోద్ ఈ కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

నడుస్తున్న కారు దగ్ధం