
భర్త చేతిలో భార్య హతం
పర్లాకిమిడి: అనుమానపు భూతం ఆవహించడంతో భర్త భార్యను హతమార్చిన సంఘటన గజపతి జిల్లా గుమ్మసమితి గైబ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాయగడ బ్లాక్ కెరడంగ గ్రామానికి చెందిన నరేంద్రపాయిక్ (31) 2019లో జి.మోనికాను (26) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒడియా–తెలుగు కుటుంబాలకు చెందిన ఇద్దరు గుమ్మాబ్లాక్ గైబలో తమ మామగారి వద్ద కిరాణా షాపు పెట్టి నివస్తున్నారు. ఇంతలో నరేంద్రపాయిక్‌కు హైదరాబాద్‌లోని కమర్షియల్ మాల్‌లో ఉద్యోగం వచ్చింది. వీరికి ఐదేళ్ల పాప ఉంది. అమ్మవారి సంబరాల కోసం ఇటీవల స్వగ్రామానికి వచ్చిన నరేంద్ర మోనికాను హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఇటీవలే గైబ గ్రామానికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆమైపె గొడ్డలిలో దాడి చేసి హతమార్చాడు. మెడలో ఉన్న రెండుతులాల బంగారం చైన్ లాక్కుని పారిపోయాడు. కుటుంబ సభ్యులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గైబ ఓ.ఐ.సి.రామకృష్ణదాస్, సెరంగో పీఎస్ అధికారి ప్రమోద్ ఖండువాల్, యస్.ఐ. కేదార్ పండా సంఘటనస్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు. నిందితుని కోసం సెరంగో పోలీసులు వెతుకుతున్నారు.

భర్త చేతిలో భార్య హతం

భర్త చేతిలో భార్య హతం