
పుస్తకావిష్కరణలో అరసం జాతీయ ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మీ నారాయణ, తదితరులు
విజయనగరం అర్బన్: తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు స్థానిక గురజాడ పాఠశాలలో గురువారం జరిగిన గురజాడ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ చాలా రచనలు చేసినప్పటికీ సమాజంలో మార్పు కోరుతూ రాసిన కన్యాశుల్కం నాటకం పేరుగాంచిందన్నారు. నేటి విద్యార్థులు గురజాడ అప్పారావును ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కవితాస్రవంతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ ఎంవీకృష్టాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, కార్యదర్శి శరత్ చంద్రజ్యోతి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీఎస్‌చలం, ఆర్.బాలకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూడిశేఖర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.