 
															పోలీసుల ఆంక్షలు.. ప్రజలకు అవస్థలు
కోడూరు: డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటన పేరుతో పోలీసులు విధించిన ఆంక్షలు ప్రజలను అవస్థలకు గురి చేశాయి. పవన్‌కల్యాణ్ గురువారం ఉదయం 10.30 గంటలకు కోడూరు చేరుకుంటా రని ప్రకటించారు. అయితే ఆయన 11.40 గంటలకు వచ్చారు. డెప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు ఉదయం ఏడు గంటల నుంచే ఆంక్షలు విధించారు. కోడూరు వంతెన సెంటర్, ఇస్మాయిల్‌బేగ్‌పేట రహదారి, రామచంద్రాపురం వద్ద ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు. కోడూరు నుంచి అవనిగడ్డ వరకు 13 కిలోమీటర్లు ఉండగా, ఈ రహదారి మొత్తం ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు అవనిగడ్డ నుంచి కోడూరు అన్ని ఆర్టీసీ సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
