
వైద్య సేవలకు గుర్తుగా అవార్డులు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వైద్యుల సేవలను గుర్తించి ఏటా అవార్డులను అందజేయడం అభినందనీయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డు–2025 ప్రదానోత్సవం మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. ముఖ్యఅతిథి మంత్రి సవిత జ్యోతి ప్రజ్వలన చేశారు.
డాక్టర్లు కనిపించే దేవుళ్లు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యులు చేస్తున్న సేవలు చాలా గొప్పవని, కనిపించే దేవుళ్లు డాక్టర్లు అని చెప్పారు. ప్రత్యేక ఆహ్వానితుడు సినీనటుడు సుమన్ మాట్లాడుతూ వైద్య వృత్తి చాలా పవిత్రమైనదన్నారు. సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిల్లో కంటే సాధారణ ఆసుపత్రుల్లోనే వైద్యసేవలు పొందడానికి తాను ప్రాధాన్యమిస్తా నన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పీవీఎస్ విజయభాస్కర్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2009 నుంచి ఏటా వైద్యరంగంలో విశేష సేవలు చేసిన వైద్యులకు అవార్డులను అందజేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవై రావు, ఎస్‌ఎల్‌వీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చైర్మన్ పి.శ్రీనివాసరాజు, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు పీవీ రమణమూర్తి, కన్వీనర్ మురళీకృష్ణ, వైద్యులు, ఫౌండేషన్‌సభ్యులు పాల్గొన్నారు. సభకు ముందుగా ఫౌండేషన్ మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు.
అవార్డులు అందుకున్నది వీరే...
డాక్టర్ ఆర్.మురళీబాబురావుకు లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును అందజేశారు. డాక్టర్ ఎల్.సుబ్బారావు, డాక్టర్ శశిబాల, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, డాక్టర్ ఎ.గాయత్రిదేవి, డాక్టర్ కోనేరు సత్యప్రసాద్, డాక్టర్ చింతా రవికుమార్‌లకు రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డులను అతిఽథులు అందజేశారు.
రూట్స్ హెల్త్ సర్వీసెస్–2025
అవార్డుల ప్రదానం