
విపత్కర పరిస్థితుల్లోనూ విధులు!
ప్రత్యేక ప్రణాళికతో..
అందరి సహకారంతో..
● ఉత్సవాలైనా, సహాయక చర్యలైనా
ముందుంటున్న పోలీసులు
● రాత్రి, పగలు తేడాలేకుండా
శాంతిభద్రతల రక్షణ కోసం కృషి
ఖలీల్‌వాడి: సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా విపత్కర పరిస్థితుల్లోనూ పోలీసులు నిరాటంకంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికి, చట్టాన్ని అమలు చేయడానికి, నేరాలను నివారించడానికి, శాంతిభద్రతలను కాపాడటా నికి పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ అత్యవసర పరిస్థితులు, పండుగలు, ప్రమాదలు, వ రదలు వచినప్పుడు పగలు, రాత్రి తేడా లే కుండా విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఒక వైపు వరదలు, మరో వైపు ఉత్సవాలు..
పండుగల వేళ అందరూ కుటుంబాలతో వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. కానీ పోలీసులు మాత్రం పండుగలు, పర్వదినాల వేళ కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి, సమాజ శ్రేయస్సు కోసం డ్యూటీలు చేస్తున్నారు. ఇటీవల గణేష్ ఉత్సవాలకు ముందు జిల్లాలో భారీవర్షాలు కురవడంతో వరదలు సంభవించాయి. దీంతో అటు ఉత్సవాలు, ఇటు వరదలు ఒకేసారి వచ్చినా పోలీసులు తమ విధులను సమయస్ఫూర్తితో నిర్వహించారు.వరదల కారణంగా కొన్ని గ్రామాల్లోకి నీరు వచ్చి చేరడం, రోడ్లు ధ్వంసం కావడంతో జిల్లా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాయి. వాగులు వంతెనల పైనుంచి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈక్రమంలో రోడ్లపై నీరు వచ్చి చేరడంతో పోలీసులు వాహనాదారులకు హెచ్చరికలు జారీ చేస్తూనే, తగిన సహాయక చర్యలు చేపట్టారు. అలాగే గణేష్ నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. అన్ని వర్గాల ప్రజలకు, గణేష్ మండళ్లకు, శాంతికమిటీలకు సమావేశాలు నిర్వహించి ప్రశాంతంగా ఉత్సవాలు ముగించారు. సీపీ సాయిచైతన్య పకడ్బందీగా వ్యవహరించి, నవరాత్రుల్లో వినాయక మండపాలు సందర్శించి, అక్కడ ఉన్న యువతకు మార్గనిర్ధేశం చేశారు. గణేష్ ఉత్సవాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు, సూచనలు చేశారు. దీంతో ఉత్సవాలతోపాటు నిమజ్జనోత్సవ శోభాయాత్రలనూ విజయవంతంగా పూర్తి చేశారు.
గతంలో వినాయక నిమజ్జనం సందర్బంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీస్ ఫోర్స్‌తో గట్టి బందోబస్తు, నిఘాను ఏర్పాటు చేసి, ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. ఉదయం, రాత్రివేళల్లో ప్రతీ గణేశ్ మండపం వద్దకు పోలీసులు గస్తీ తిరిగారు. నిజామాబాద్ పోలీస్‌కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్‌లో వినాయక ఉత్సవాలు ప్రారంభమైనప్పటినుంచి ముగింపు వరకు సీపీ పోతరాజు సాయిచైతన్య పర్యటించారు. ఒకవైపు వరదలు, మరో వైపు వినాయక ఉత్సవాల్లో వారంరోజుల నుంచి పోలీసులు కంటిమీద కునుకు లేకుండా, రోడ్లపైనే నిల్చుని సమర్థవంతంగా డ్యూటీలు చేశారు. నిజామాబాద్ కమిషనరేట్‌లో నిమజ్జన వేడుకల్లో పోలీసులు రెండురోజులు ఆన్‌డ్యూటీలోనే ఉండటంతో ప్రజలు పోలీస్‌లకు హాట్సాప్ అంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
జిల్లాలోని అధికారులు, సిబ్బంది సహకారంతో సమిష్టిగా పని చేయడంతో గణేష్ ఉత్సవాలు విజయవంతంగా పూర్తిచేశాం. ఆలాగే భారీ వర్షాలకు ప్రజల వద్దకు వెళ్లి సహకారం అందించాం. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూశాం. నగరంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిమజ్జనం సమయంలో ప్రత్యేకంగా పర్యవేక్షించాం. వరదలు, ఉత్సవాలకు ప్రతీ పోలీసు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పనిచేశారు.
– పోతరాజు సాయిచైతన్య, సీపీ, నిజామాబాద్

విపత్కర పరిస్థితుల్లోనూ విధులు!

విపత్కర పరిస్థితుల్లోనూ విధులు!

విపత్కర పరిస్థితుల్లోనూ విధులు!