
సలీం మృతదేహం
కామారెడ్డి క్రైం: జులాయిగా తిరిగే కొడుకు.. తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. అందరం కలిసి చనిపోదామంటూ చెరువు వద్దకు తీసుకువెళ్లి, తల్లిదండ్రులను చెరువులో తోసేయడంతో.. తండ్రి నీట మునిగి చనిపోయాడు. అపస్మారక స్థితిలో ఉ న్న తల్లిని బంధువులు కాపాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.
కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివసించే రేష్మా బేగం, మహ్మద్ సలీం(55) దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నా రు. అందరికీ వివాహమైంది. చిన్నవాడైన ఖలీం మద్యానికి బానిసై, ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతుండడంతో అతడి భార్య విడాకులు ఇచ్చి పుట్టింటికి వెళ్లిపోయింది. ఖలీం తాగుడుకు డబ్బులకోసం తల్లిదండ్రులను తరచూ వేధించేవా డు. ఇటీవల దుబాయి వెళ్తానని, దానికి డబ్బులు ఇవ్వాలని అడగడంతో తమ వద్ద లేవని వారు చెప్పారు. వారం తర్వాత ఇస్తామన్నా వినకుండా.. తనను ఎందుకు కన్నారంటూ నిత్యం కొడుతుండేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం సైతం డబ్బుల కోసం ఇంట్లో గొడవ జరిగింది. ముగ్గురం కలిసి ఆత్మహత్య చేసుకుందామనడంతో తల్లిదండ్రులు సైతం అతడి వెంట కామారెడ్డి పెద్ద చెరువు వద్దకు తీసుకువెళ్లాడు. చెరువులోకి ముగ్గురూ దిగగా.. ఖలీం తోసివేయడంతో తల్లిదండ్రులిద్దరూ నీటిలో మునిగిపోయాడు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రేష్మ బేగం అల్లుడు ఆటోలో చెరువు వద్దకు వచ్చి రేష్మ బేగం, సలీంలను అస్పత్రికి తరలించా డు. అప్పటికే సలీం మృతిచెందినట్లు వైద్యులు ధ్రు వీకరించారు. రేష్మ బేగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఖలీంపై కేసు నమోదు చేశామని కామారెడ్డి ఎస్‌హెచ్‌వో నరేష్ తెలిపారు.
తల్లిదండ్రులను చెరువులో
తోసేసిన కొడుకు
తండ్రి మృతి, అపస్మారక స్థితిలో తల్లి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
