
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు కంట్రోలర్ ఎం.అరుణ తెలిపారు. తెయూ క్యాంపస్ ఆర్ట్స్ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని వీసీ రవీందర్‌గుప్తా తనిఖీ చేశారు. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపాల్ ఆరతికి సూచించారు. తెయూ సౌత్‌క్యాంపస్ (భిక్కనూర్) పరీక్షా కేంద్రాన్ని కంట్రోలర్ అరుణ తనిఖీ చేశారు.
వైద్య సేవలను ప్రజల
చెంతకు చేర్చాలి
ఇందల్వాయి : ఇందల్వాయి పీహెచ్‌సీని కేంద్రాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ కన్సల్టెంట్ డా. ఉష్మ శుక్రవారం సందర్శించారు. టీబీ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె వైద్యసిబ్బందికి సూచించారు. జిల్లా వైద్యాధికారి డా.సుదర్శనం మాట్లాడుతూ టీబీ నియంత్రణలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఆరోగ్య కేంద్రం వైద్యుడు సంతోష్, హెచ్‌ఈవో శంకర్, టీబీ కోఆర్డినేటర్ రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
