
ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు
సిరికొండ: మండల కేంద్రంలోని శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో 60వ వార్షిక ఉత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి అర్చకులు శ్రీకాంత్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో శుక్ర, శనివారాల్లో హోమం, పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం అన్నసత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఉపసర్పంచ్ బడాల రామకృష్ణ, కమిటీ సభ్యులు డాక్టర్ లింబాద్రి, గంగాధర్, రంజిత్, భూషణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.