
వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న బీజేపీ నాయకులు
సుభాష్‌నగర్: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 6నుంచి 14వ వరకు ‘పల్లెపల్లెకు ఓబీసీ – ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమాన్ని చేపడు తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్స య్య పేర్కొన్నారు. ఈమేరకు నగరంలోని పార్టీ కా ర్యాలయంలో గురువారం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం మోదీ ప్రభుత్వం బీసీలకు చేకూర్చిన ప్రయోజనాలు ప్రజలకు తెలిపేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు మోదీ స్థానం కల్పించాలని, వీరిలో ఐదుగురు కేబినెట్ ర్యాంక్‌లో ఉన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 33శాతమున్న బీసీ రిజర్వేషన్లను దాదాపు 10శాతం తగ్గించి, 23శాతానికి కుదించారని, రాష్ట్రంలో బీసీలను సర్పంచులు కాకుండా రాజకీయంగా అణచివేసే కుట్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, నాయకులు యామద్రి భాస్కర్, లక్ష్మీనారాయణ, శీల శ్రీనివాస్, నాగరాజు, శ్రీనివాస్‌శర్మ, ఇప్పకాయల కిషోర్, రాజన్న, నారాయణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.