నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో గురువారం శ్రీరామ నవమి రోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భక్తులు భారీగా రామాలయానికి తరలివచ్చిన సమయంలో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంపై వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. సాయంత్రం 6.40 నుంచి రాత్రి 8.50గంటల వరకు పలుమార్లు కరెంట్ పోవడం, రావడం జరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలో నిలబడ్డ సమయంలో కరెంట్ పోవడంపై వారు మండిపడుతున్నారు. పలుమార్లు భక్తులు ఫోన్ చేసినా విద్యుత్‌శాఖ అధికారులు ఫోన్‌లు లిప్టు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నగరం అంతా కరెంట్ ఉందని, కేవలం ఖిల్లా చౌరస్తా నుంచి ఖిల్లా రామాలయం వరకు, ఆలయంలో విద్యుత్ సరఫరాలో లేదన్నారు. మధ్యాహ్నం సీతారాముల కల్యాణ సమయంలో కూడా కరెంట్ లేదని భక్తులు పేర్కొంటున్నారు. ఆలయంలో విద్యుత్ సరఫరా లేని ఫోటోలు, వీడియోలు సామాజిక మధ్యామాల్లో పెట్టి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు నిలదీస్తున్నారు.