
● 38.9 డిగ్రీల సెల్సియస్ నమోదు..
● క్రమంగా పెరుగుతున్న
పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు
సుభాష్‌నగర్ : జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. వారం పదిరోజులుగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం 38.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. మార్చి ముగిసేనాటికి 40 డిగ్రీలకుపైనే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 25.4 డిగ్రీలుగా నమోదైంది. రాత్రివేళల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరగడం మూలంగానే ఉక్కపోతలు ఎక్కువయ్యాయి. గాలివేగం తక్కువగా ఉండటం వల్లే ఉక్కపోతతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. మార్చి రెండోవారంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించినా.. కొన్ని మండలాల్లో మినహా జిల్లాపై వర్ష ప్రభావం పెద్దగా చూపలేదు. గాలులు వీయ డంతో వాతావరణం కొంత చల్లగా మారినప్పటికీ.. గత వారం రోజుల నుంచి ఎండలు మండుతున్నాయి. ఉదయం 11 దాటితే బయటికి వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం 5 తర్వాతే బయటికి వస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో సగటు ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. 2003లో జిల్లా చరిత్రలో అత్యధికంగా 47.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, గతేడాది మే రెండోవారంలో అత్యధికంగా 45.9 డిగ్రీలుగా నమోదైంది.
ఉక్కపోతతో ఇబ్బందులు..
ఎండలు ముదరడంతో ఉక్కపోతలు పెరిగాయి. గాలివేగం తక్కువగా ఉండటం, కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడం ఉక్కపోతల కు కారణమని అధికారులు పేర్కొన్నారు.
ఐదు రోజులుగా నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు

