నేడు సీపీ పదవీ విరమణ

- - Sakshi

జిల్లా కేంద్రానికి

ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి రాక

కామారెడ్డి ఎస్పీకి అదనపు బాధ్యతలు?

ఖలీల్‌వాడి: నేడు సీ పీ నాగరాజు పదవీ విరమణ చేయనున్నారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్‌ రేంజ్‌ ఇన్‌చార్జి ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి రానున్నట్లు తెలిసింది. జిల్లా సీపీగా కెఆర్‌ నాగరాజు 2021 డిసెంబర్‌ 26న బాధ్యతలు స్వీకరించారు. సీపీ పదవీవిరమణ చేయడంతో నిజామాబాద్‌ సీపీగా కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇస్తారనే ప్రచారం పోలీస్‌వర్గాల్లో జరుగుతోంది. లేకుంటే శుక్రవారం రాత్రి వరకు కొత్త సీపీ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్లు స మాచారం. ఇప్పటికే నలుగురు పేర్లు తెరపై కి రాగా హైదరాబాద్‌లోని వెస్ట్‌జోన్‌ పరిధిలో పనిచేసే ఐపీఎస్‌ అధికారి జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.

నేడు డయల్‌ యువర్‌ ఆర్టీసీ

ఖలీల్‌వాడి : నేడు నిజామాబాద్‌ రీజియన్‌లో డయల్‌ యువర్‌ ఆర్టీసీ ప్రోగ్రాం శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఎం ఉషా దేవి తెలిపారు. ఉమ్మడి జిల్లాల ప్రయాణికులు ఆయా నంబర్లకు ఫోన్‌చేసి తమ సమస్యలను, సూచనలను తెలపాలన్నారు.

రీజినల్‌ మేనేజర్‌, నిజామాబాద్‌ 9959226011

డిపో మేనేజర్‌, ఆర్మూర్‌ 9959226019

డిపో మేనేజర్‌, బోధన్‌ 9959226001

డిపో మేనేజర్‌, నిజామాబాద్‌–1 9959226016

డిపో మేనేజర్‌, నిజామాబాద్‌–2 9959226017

డిపో మేనేజర్‌, కామారెడ్డి 9959226018

డిపో మేనేజర్‌, బాన్స్‌వాడ 9959226020

అధ్యాపకులు

రిపోర్ట్‌ చేయాలి

నిజామాబాద్‌అర్బన్‌ : ఇంటర్‌ మూల్యాంకన కేంద్రంలో విధులు నిర్వర్తించే అధ్యాపకులు రిపోర్టు చేయాలని ఇంటర్‌ విద్యాధికారి ర ఘురాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శు క్రవారం నుంచి ప్రారంభమవుతున్న మొద టి స్పెల్‌ ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకన విధుల ఆర్డర్‌ కాపీలు వచ్చిన ఉమ్మడి జి ల్లాలోని ప్రతి అధ్యాపకుడు వెంటనే రిపోర్ట్‌ చేయాలన్నారు. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, గణిత శాస్త్రం, పౌరశాస్త్రంకు సంబంధించిన మూల్యాంకనానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇంటర్‌ బోర్డు నిబంధనల ప్ర కారం మూల్యాంకన విధులకు హాజరుకాని అధ్యాపకులపై, గతంలో హాజరుకాని అ ధ్యాపకులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఉత్తరాధికారిగా

రాంచంద్రస్వామి

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : నగరంలోని పె ద్ద రాంమందిర్‌ మఠం ఉత్తరాధికారిగా రాంచంద్రస్వామి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్రలో సమర్థరామదాసు స్థాపించిన సజ్జన్‌ఘడ్‌ పీఠాధిపతి యోగేష్‌ బువ ముఖ్య అతిథిగా హాజరై రామచంద్రస్వామితో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుత పీఠాధిపతిగా దినకర్‌ స్వామి కొనసాగుతున్నారు. దినకర్‌స్వామి తదనంతరం ప్రస్తుతం కొనసాగుతున్న రాంచంద్రస్వామి పీఠాధిపతిగా వ్యవహరిస్తారు. శ్రీరామనవ మిని పురస్కరించుకుని పెద్దరాంమందిర్‌లో శ్రీరాముని జనన మహోత్సవాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా శ్రీరా మ నవమి సందర్భంగా సీతారాముని కల్యాణం చే స్తా రు. అయితే జిల్లాకేంద్రంలోని పెద్దరామందిర్‌లో మాత్రం కల్యాణానికి బదులు శ్రీరా ముని జనన మహోత్సవం నిర్వహించ డం ప్రత్యేకత. కాగా శుక్రవారం ఈ ఆలయంలో అన్నదానం చేయనున్నట్లు బాధ్యులు అజయ్‌సంగ్వీ, వెంకట్‌రావ్‌ కులకర్ణి తెలిపారు.

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top