
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం వంద శాతానికి చేరువలో ఉంది. 530 పంచాయతీలకు గాను 216 జీపీల్లో వంద శాతం పన్నులు వసూలు చేశారు. మరో 314 పంచాయతీల్లో 85 శాతానికి పైగా ఇంటి పన్నులు వసూలు చేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరం నేటితో ముగిసిపోనుండగా ఈ ఏడాదికి సంబంధించిన ఇంటి పన్నులు ఇంకా వసూలు చేయాల్సి ఉంది. ఇంటి పన్నుల వసూళ్లలో వెనుకబడిన జీపీల్లో స్పెషల్‌డ్రైవ్‌ను నిర్వహించారు. అయినప్పటికీ ఆర్థిక ఏడాది ముగిసేలోపు ఇంకా కొంత బకాయిలు ఉండటంతో పూర్తిస్థాయిలో వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం రూ. 25,20,11,226 ఉంటే ఇందులో రూ. 21,80,82,974ను వసూలు చేశారు. అంటే జిల్లాలో 86.54 శాతం ఇంటి పన్నులను వసూలు చేసినట్లు వెల్లడవుతుంది. మరో 13.46 శాతం ఇంటి పన్నులను ఏప్రిల్ మొదటి వారంలోనే పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇంటి పన్నుల వసూళ్లలో వెనుకంజలో ఉన్న జీపీకి సంబంధించి సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఉద్యోగులపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. 2018లో పంచాయతీరాజ్ చట్టంను సవరించకముందు ఇంటి పన్నుల బకాయిలు అనేకం పేరుకుపోయేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.
వంద శాతం వసూలు చేస్తాం
వంద శాతం ఇంటి పన్నులు వసూలు కాని గ్రా మాల్లో ప్రత్యేక బృందాలతో వారం, పది రోజుల వ్యవధిలోనే వంద శాతం వసూళ్లను పూర్తిచేస్తాం. ప్రజల సహకారం బాగుంది. బకాయిలు చెల్లించనివారు పంచాయతీలకు వెళ్లి ఇంటి పన్నులను చెల్లించి వంద శాతం వసూళ్లకు సహకరించాలి.
– డాక్టర్ జయసుధ, డీపీవో
డివిజన్లవారీగా పన్ను వసూళ్లు.. (రూపాయలు)
216 జీపీల్లో వందశాతం పూర్తి
ఇంటి పన్ను వసూళ్లు 86.54 శాతం
మిగిలిన జీపీల్లో వసూళ్ల కోసం
అధికారుల ప్రత్యేక డ్రైవ్
రూ. 25.20 కోట్ల పన్నులకు గాను రూ. 21.80 కోట్ల వసూళ్లు