
నిజామాబాద్ నాగారం : పల్లెల్లో విద్యుత్ సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. సంస్థ అధికారులు నేరుగా వినియోగదారుల వద్దకే రానున్నారు. ఆయా పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా సర్వే చేపట్టారు. జిల్లాలోని ఏఈ, ఏడీఈ, డీఈలు సెక్షన్లలో ఉన్న గ్రామాలను దత్తత తీసుకుని విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే 75 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. అతి త్వరలోనే పనులు ప్రక్రియ ప్రారంభం కానుంది.
సమస్యల్లేకుండా చూడాలని..
జిల్లాలో నాలుగు డివిజన్లు ఉన్నాయి. బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్, నిజామాబాద్ రూరల్ ఉండగా, నాలుగు సబ్ డివిజన్లు అంటే 14 మంది ఏడీఈలు, మొత్తం 50 సెక్షన్‌లకు ఏఈలున్నారు. అయితే విద్యుత్ సీఎండీ గోపాల్‌రావు ఆదేశాల మేరకు పల్లెలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు గాను నలుగురు డీఈలు, 14మంది ఏడీఈలు, 50 మంది ఏఈలు డివిజన్లు, సబ్‌డివిజన్, సెక్షన్ పరిధిలో ఉన్న ఒక్కో అధికారి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ఎంపిక చేసుకున్న గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లాలో 75 గ్రామాల్లో పనులు గుర్తించారు. నిధుల రాగానే పనులు చేపట్టనున్నారు.
మున్సిపాలిటీలో కూడా..
నగరంలోని ముగ్గురు ఏడీఈలు, తొమ్మిది మంది ఏఈలున్నారు. నగరంలో ఉన్న ఆరు జోన్ల పరిధిలోని 60 డివిజన్లలో ఉన్న కాలనీల్లో ఒక్కో కాలనీని అధికారులు దత్తత తీసుకున్నారు. పల్లెలో మాదిరిగానే, పట్టణాల్లో కూడా సమస్యలు పరిష్కరించనున్నారు.
మెరుగైన సేవల కోసమే..
జిల్లాలో ఇప్పటికే 75 గ్రామాలను డీఈ, ఏడీఈ, ఏ ఈలు దత్తత తీసుకున్నారు. అందులో నెలకొన్న స మస్యలకు సర్వే పూర్తి చేశారు. విద్యుత్ సిబ్బంది, అ ధికారుల ద్వారా ఏప్రిల్‌లో పనులు చేస్తారు. కాంట్రాక్టర్ ద్వారా చేసే పనులకు నిధులు రాగానే ప్రా రంభిస్తారు. ప్రతి గ్రామాన్ని 100 శాతం ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– రవీందర్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ
ఏఈ, ఏడీఈ, డీఈలకు
ఒక్కో గ్రామం కేటాయింపు
ప్రత్యేక సర్వే ద్వారా 75 గ్రామాల్లో పనుల గుర్తింపు
త్వరలోనే పనులకు శ్రీకారం
సంస్థ ద్వారా చేసే పనులివి..
అధికారులు దత్తత తీసుకున్న గ్రామాల్లో డిపార్ట్‌మెంట్ ద్వారా కొన్ని పనులు చేస్తారు. ఇందులో లూస్‌లైన్లు, ఆగిపోయిన మీటర్లు, సపోర్ట్ వైర్లు తదితర ఉన్నాయి. ఇవి విద్యుత్ అధికారులు సిబ్బంది ద్వారా పనులు చేయిస్తారు.
ఆన్‌లైన్ పేమెంట్స్‌పై అవగాహన
జిల్లాలో ప్రస్తుతం 75గ్రామాల్లో కచ్చితంగా ఆన్‌లైన్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించేలా వినియోగదారులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. 100శాతం అందరు ఆన్‌లైన్‌లో చెల్లించేలా ప్రోత్సహిస్తారు. అలాగే సిటిజన్ చార్ట్ ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు, సిబ్బంది, అధికారుల ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కాంట్రాక్టర్ ద్వారా..
ఆయా గ్రామాల్లో విరిగిన, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, మిడిల్ పోల్స్, స్ట్రీట్‌లైట్, రోడ్డు క్రాసింగ్‌లో ఉంటే, ట్రాన్సుఫార్మర్లకు గద్దెలు నిర్మించడం తదితర ఉన్నాయి. నిధులు రాగానే ఈ పనులు ప్రారంభించనున్నారు.