
● అంగరంగ వైభవంగా..
శుక్రవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2023
డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో సీతారాముల కల్యాణానికి హాజరైన భక్తులు
దేవదేవుడి కల్యాణాన్ని భక్తజనం కనులారా వీక్షించి పులకించిపోయారు. అభిజిత్ లగ్నంలో జగన్మాత సీతమ్మ మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్యధారణ చేశారు. జిల్లావ్యాప్తంగా గురువారం రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ఖిల్లా రామాలయం, సుభాష్‌నగర్ రామాలయం, గాజుల్‌పేట్‌లోని బడా రాంమందిర్, డిచ్‌పల్లిలోని ఖిల్లా రామాలయం, బోధన్‌లోని శక్కర్‌నగర్ రామాలయంలో ఆర్మూర్‌లోని నవనాథుల సిద్దుల గుట్టపై, పోచంపాడ్‌లోని కోదండ రామాలయాల్లో రాములోరి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. సిరికొండ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే నందిపేట కేదారీశ్వర ఆశ్రమంలోనూ సీతారాముల కల్యాణాన్ని మంగిరాములు మహరాజ్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా ఆలయాల్లో కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించారు. నగర శివారులోని మాధవనగర్ సాయిబాబా ఆలయం వద్ద ఆర్వోబీ పనులు జరుగుతున్న దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. – వివరాలు లోపలి పేజీల్లో..
న్యూస్‌రీల్




