
నిజామాబాద్ సిటీ: నగరంలోని ముబారక్‌నగర్‌కు చెందిన బిల్ల బాబు శ్రీరామనవమి సందర్భంగా 2,01,400 బియ్యం గింజలపై శ్రీరామ్ అని రాసి హైదరాబాదులోని కూకట్‌పల్లి రామాలయంలో గు రువారం అందజేశారు. ప్రతి ఏడాది ఎంతో శ్రద్ధ, ఓపికతో బియ్యం గింజలపై శ్రీరామ్ అని రాస్తూ శ్రీరామనవమి సందర్భంగా వివిధ ఆలయాలకు తలంబ్రాల రూపంలో బిల్ల బాబు అందజేస్తూ వ స్తున్నారు. 2018లో 1,61,000 బియ్యం గింజలపై శ్రీరాం అని రాసి నిజామాబాద్‌లోని రఘునాథ ఆలయంలో అందజేశారు. 2019లో 1,56,000 బియ్యం గింజలపై శ్రీరాం అని సుభాష్‌నగర్ రామాలయంలో అందజేశారు. గతేడాది డిచ్‌పల్లి రామాలయంలో 1,61,000 బియ్యం గింజలపై శ్రీరాం అని రాసి అందజేశారు.
