
శోభాయాత్రలో అపశ్రుతి
● ట్రాక్టర్‌కు విద్యుత్ తీగ తగిలి ఇద్దరికి గాయాలు
నందిపేట్: నందిపేటలో రామ్‌నగర్ కాలనీకి చెందిన శ్రీరామ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రాముడి శోభాయాత్రలో అపశ్రుతి నెలకొంది. ట్రాక్టర్‌కు రా ముడి ప్రతిమతో కట్టిన ఫ్లెక్సి ఫ్రేమ్‌కు ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైరు తగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్ సరఫరా అయింది. దీంతో ట్రాక్టర్‌లో కూర్చు న్న పిల్లలతో పాటు యువకులు కరెంట్‌షాక్‌కు గురయ్యారు. ఈ విషయం గమనించిన ట్రాక్టర్‌లో ఉన్న యువకుడు పిల్లలను బయటకు విసిరేశాడు. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న శ్రీనివాస్, పెయింటర్ రాజుతో పాటు పది సంవత్సరాల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. ట్రాక్టర్ మూడు టైర్లు కాలిపోయాయి. ట్రాక్టర్‌పై ప్లాస్టిక్ టార్పాలిన్ పరచి ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు. గాయపడిన బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న రాజు, శ్రీనివాస్
