
శశిధర్
నిజామాబాద్‌నాగారం/కమ్మర్‌పల్లి: జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు జిల్లా నుంచి క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 4 వరకు మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి టోర్నీ జరగనుంది. ఈనెల 26 నుంచి 30 వరకు హైదరాబాదులో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంపిక కావటంతో వారినిఇ జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు మానస గణేష్, ప్రధాన కార్యదర్శి శ్యామ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, సలహాదారులు ఎన్వీ హనుమంత్ రెడ్డి, తదితరులు అభినందించారు.
ఎంపికై న క్రీడాకారులు..
ఉమ్మడి జిల్లా నుంచి శశిధర్( గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కామారెడ్డి), సాయి శివ (గిరిరాజ్ కాలేజ్ నిజామాబాద్), శివాని( గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మోర్తాడ్), దీపిక (గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఉఫ్లూర్) ఎంపికయ్యారు.

శివాని

సాయిశివ

దీపిక