
అమూల్య(ఫైల్)
ఇందల్వాయి: నాగుపాము కా టుతో నాలుగేళ్ల పసికందు మృతిచెందిన విషాద ఘటన మండలంలోని గన్నారంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివవరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి రజిత గంగాధర్ దంపతులకు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు కవలలుగా పుట్టగా అందులో అమూల్య పెద్దది. చిన్నారి ఇంటి ముందర ఆడుకుంటున్న సమయంలో నాగుపాము కాటు వేసింది. విషయయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. కాగా ఆ పామును స్థానికులు చంపేశారు.
మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి: తాడ్వాయికి చెందిన దూదేకుల జాకీర్ హుస్సేన్(44) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. జాకీర్ హుస్సేన్ బతుకు దె రువు కోసం దుబాయికి వెళ్లి వస్తుండేవాడు. ఇటీవల దుబాయి నుంచి తిరిగి వచ్చాడు. జాకీర్‌కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కొన్ని నెలల క్రితం జాకీర్ కూతురు వేరే అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకొని వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన జాకీర్ రోజు మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడుతుండేవాడు. బుధవారం రాత్రి బాగా మద్యం తాగి వచ్చి ఇంట్లో ఉన్న భార్య, కొడుకుతో గొడవ పడి వారిని కొట్టడంతో వారిద్దరు వేరే వాళ్ల ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. అనంతరం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రఫియా భేగం ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.
డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు
గాంధారి: మద్యం తాగి వాహనం నడిపిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. మండల కేంద్రంలో నిర్వహించిన వా హన తనిఖీల్లో కామారెడ్డికి చెందిన ఎండీ షఫి మద్యం తాగి వాహనం నడిపినట్లు గుర్తించామన్నారు. ఆయనపై కేసు నమోదు చేశామన్నారు.