సుభాష్‌నగర్: నిరుద్యోగ యువతకు టాటాస్ట్రైవ్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సెంటర్ ఇన్‌చార్జి ఎండీ పాష ఒక ప్రకటనలో తెలిపారు. హోటల్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, బీపీఓ, రిటైల్, నర్సింగ్ కోర్సుల్లో శిక్షణనిస్తామన్నారు. ఉచిత హాస్టల్ వసతి ఉంటుందని పేర్కొన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులై, డిగ్రీ వరకు చదువుకున్న వారు అర్హులని, 18 నుంచి 27 ఏళ్లలోపు యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8328368554, 8074306410 నంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.
రేపు సైకిల్ ర్యాలీ
ఖలీల్‌వాడి: ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ సంఘం సహకారంతో ఏప్రిల్ 1న ఉదయం 7 గంటలకు జిల్లా కోర్టులో సైకిల్ ర్యాలీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.