సంక్షిప్తం | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం

Published Thu, Mar 30 2023 1:58 AM

-

సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

ఇందల్వాయి: మండలంలోని రూప్లానాయక్‌ తండాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఎంపీపీ రమేష్‌ నాయక్‌, ఎంపీటీసీ లలిత ప్రారంభించారు. రోడ్డు పనులకు ఉపాధి హామీ నిధుల నుంచి రూ.15లక్షల నిధులు మంజూరైనట్లు వారు తెలిపారు.

అక్రమ కట్టడం కూల్చివేత

నిజామాబాద్‌నాగారం:నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో అక్ర మంగా రోడ్డు కబ్జా చేసి నిర్మాణం చేపట్టిన భవన కట్టడాన్ని మున్సిపల్‌ ఎన్‌పోర్సుమెంట్‌ అధికారులు బుధవారం కూ

ల్చివేశారు.అక్రమ కట్టడంపై ఫిర్యాదు రావడంతో అధికారు లు పరిశీలించి, పోలీసు బందోబస్తు మధ్య కూల్చి వేశారు.

రక్తదాన శిబిరం

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని వాగ్ధేవి డిగ్రీకళాశాలలో బుధవారం జాతీయ సేవ పతకం యూనిట్‌–1,2 ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా పలువరు వలంటీర్లు రక్తదానం చేశారు. ప్రోగ్రాం అధికారి రవీంద్రరావు, కళాశాల సెక్రటరీ సుజన్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ వెంకట్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

సామూహిక సీమంతాలు

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మండలంలోని మంచిప్ప అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసాన కార్యక్రమం నిర్వహించారు. ఉపసర్పంచ్‌ జగదీష్‌, అంగన్‌వాడీ టీచర్‌, సిబ్బంది, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.

భయాన్ని వీడి పరీక్షలు రాయాలి

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): పదో తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని వీడాలని, ప్రణాళిక ప్రకారం చదువు తూ వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మంచిప్ప ఉప స ర్పంచ్‌ జగదీష్‌, పాఠశాల హెచ్‌ఎంలు గోపాలచారి, శ్రీకాంత్‌ పేర్కొన్నారు. మండలంలోని మంచిప్ప, బోర్గాం(పి) జి ల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటుచేశారు. విద్యార్థులు నృత్యాలు, ఆటపాటలతో ఆకట్టుకున్నారు. వీడీసీ చైర్మన్‌ నవీన్‌, ఎస్‌ఎంసీ అధ్యక్షుడు మల్లేష్‌, నవీన్‌, సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాలు

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మండలంలోని కంజర్‌, మోపాల్‌, నర్సింగ్‌పల్లి, సిర్‌పూర్‌, కులాస్‌పూర్‌ గ్రామాల్లో ఆయా కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాలు బుధవారం ఐదోరోజు కొనసాగాయి. మోపాల్‌, నర్సింగ్‌పల్లి గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. మోపాల్‌, సిర్‌పూర్‌, కంజర్‌, కులాస్‌పూర్‌లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా పరిసరాలు శుభ్రం చేశారు. అనంతరం గ్రామాల్లో విద్య, నిరుద్యోగం, తదితర అంశాలపై ఇంటింటా సర్వే నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు అంబర్‌సింగ్‌, సునీత పాల్గొన్నారు.

‘ఆయుష్మాన్‌ భారత్‌’ సద్వినియోగం చేసుకోవాలి

సుభాష్‌నగర్‌: దేశంలోని పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్ర వేశపెట్టిన ఆయూష్మాన్‌ భారత్‌లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని హిందూ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ ధాత్రిక రమేష్‌ పేర్కొన్నారు. నగరంలోని అర్హులైన పేదలను గుర్తించి బుధవారం ధాత్రిక రమేష్‌, ఐటీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నరేష్‌ గౌడ్‌ ఆధ్వ ర్యంలో తెల్ల రేషన్‌కార్డుతో ఆన్‌లైన్‌లో ఈ–కేవైసీ చేశారు. నే డు, రేపు కూడా ఈ–కేవైసీ చేపడుతామని వారు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement