
ఒక్కో పసి బిడ్డది ఒక్కో విషాద గీతిక.. ఒకరికి ముళ్ల పొదలే పొత్తిళ్లు ఐతే.. ఎవరి పాపమో మతిస్థిమితం లేని తల్లికి పుట్టింది మరో పాప.. భార్య నిద్రిస్తుండగా భర్త బిడ్డను ఎత్తుకెళ్లి అంగట్లో అమ్మకానికి పెట్టాడు ఇంకో దగ్గర.. ఆమెకు ఫిట్స్ వస్తే నాలుగు రోజులు కోమాలోనే ఉంటుంది. భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ఈ స్థితిలో ఓ బిడ్డ తల్లికి దూరమైంది. ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు కొందరు.. ఇలా నిజామాబాద్‌లోని శిశుగృహకు చేరిన చిన్నారుల నేపథ్యాల్లో అంతులేని విషాదం కనిపిస్తుంది. వీరిని శిశుగృహ తల్లిలా ఆదరిస్తోంది. అందులోని సిబ్బంది మాతృ ప్రేమను పంచుతున్నారు. ప్రస్తుతం 12 మంది శిశువులు ఆశ్రయం పొందుతున్నారు.
–బి ప్రభాకర్, నిజామాబాద్ డెస్క్
170 మంది పిల్లల దత్తత
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడి చే నిజామాబాద్‌లోని శిశుగృహ ద్వారా 2011 నుంచి ఇప్పటి వరకు 170 మంది పిల్లలను దత్తత ఇ చ్చారు. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ రిసోర్స్ అడాప్షన్ అథారిటీ (కార) వెబ్‌సైట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా దత్తత అప్రూవల్ కమిటీ పిల్లలను దత్తత తీసుకునే దంపతుల ఆర్థిక స్థితిగతులు, మెడికల్ ఫిట్నెస్ పరిశీలిస్తుంది. అప్రూవల్ కమిటీలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, శిశు గృహ మేనేజర్, మెడికల్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. అప్రూవల్ కమిటీ సిఫారసు మేరకు పిల్లల దత్తతకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తా రు. ఇటలీ, కెనడా, అమెరికా, జర్మనీ దేశాలకు కూడా పిల్లలను దత్తత ఇచ్చినట్లు నిజామాబాద్ శిశుగృహ అధికారులు తెలిపారు.
నయవంచన..
నగరానికి చెందిన యువ తి ప్రేమించిన వాడి చేతిలో మోసపోయింది. కుటుంబ సభ్యులతో ఉండలేక ముంబయికి చేరింది. అక్కడా నయవంచనే... పరిచయమైన ఒకడు తోడుగా ఉంటానన్నాడు. ఆడబిడ్డ కలిగాక కనిపించకుండా పోయాడు. భర్త లేకుండా బిడ్డతో ఉన్న ఆ మెను నీ వెవరూ, ఎవరి బిడ్డ అంటూ కనిపించిన వారందరూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ క్ర మంలో యువతి దాదాపుగా మతిస్థిమితం కోల్పోయింది. భిక్షాటన చేస్తూ వెళ్లి.. బెంగళూరు రైల్వే స్టేషన్‌లో పక్కన బిడ్డతో అపస్మారక స్థి తిలో పడిఉండగా అక్కడి అధికారులు చేరదీశారు. ఆమె వద్ద లభించిన ఆధారాలతో నిజామాబాద్ త రలించి యువతికి వసతి కల్పించారు. బిడ్డను శిశుగృహలో చేర్చారు. ప్రస్తుతం పాపకు రెండేళ్లు.
ముళ్లపొదలే పొత్తిళ్లు ..
కామారెడ్డి జిల్లాలోని ఓ తండా వద్ద అప్పుడే పుట్టిన మగ శిశువును ఎవరో ముళ్ల పొదల్లో వదిలేశారు. అ టు వెళ్లిన కొందరికి చీమలు పట్టిన బాలుడు అల్లాడుతూ కనిపించాడు. చీమలను దులిపేసి సపర్య లు చేశారు. బాలుడిని శిశు గృహకు తరలించారు.
అంగట్లో సరుకై..
సంచార జీవుల కుటుంబం డిచ్‌పల్లి మండలంలో ని ఓ చెట్టు కిందకు చేరింది. బిడ్డతో భార్య నిద్రిస్తుండగా భర్త బిడ్డను ఎత్తుకెళ్లి వీధిలో అమ్మే ప్రయత్నం చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించారు. నిబంధనల ప్రకారం శి శువుని తల్లికి అప్పగిస్తామన్నారు. నెల రోజులు పో లీసులు, ఆస్పత్రి చుట్టూ తిరిగిన తల్లి తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో శిశువును శిశుగృహ కు తరలించారు.
నిస్సహాయ స్థితి..
ఆమెకు ఫిట్స్ వస్తే నాలుగు రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉంటుంది. భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో కొడుకు బాగోగులు చూడడం భారమైంది. ఆమె దీన స్థితిని చూసిన గ్రామస్తులు ఆమెతో పా టు బాలుడిని శిశుగృహకు తీసుకొచ్చారు. తల్లి బిడ్డ ను శిశుగృహ అధికారులకు స్వచ్ఛందంగా అప్పగించింది. వారం రోజులకే శిశు గృహకు వెళ్లి తన బిడ్డను తెచ్చుకుంది. వారం తిరక్క ముందే బిడ్డను శిశుగృహకు తీసుకొచ్చింది. బిడ్డను శిశుగృహ ఆవరణలో వదిలిపెట్టి వెళ్లింది.
● గోడకూలి భార్య, భర్త, కొడుకు మృతి చెందారు. ముగ్గురు ఆడపిల్లలు ప్రమాదం నుంచి బయట ప డ్డారు. అధికారులు పెద్ద పిల్లలను గురుకులంలో చేర్పించి, చిన్న పాపను శిశుగృహకు తరలించారు.
● తండ్రిలేడు.. తల్లి కూడా చనిపోవడంతో మైనా రిటీ తీరని కొడుకు గొర్ల కాపరిగా మారాడు. గ్రామస్తులు ఇద్దరు ఆడపిల్లల్లో ఒకరిని గురుకులంలో చే ర్చారు. చిన్న పాపను శిశుగృహకు తరలించారు. చెల్లిని చూసేందుకు అన్న శిశుగృహకు వస్తుంటాడు. చెల్లిని దత్తత ఇస్తే ఆమె భవిష్యత్తు బాగుంటుందని అధికారులు చెబితే.. అస్సలే దత్తత ఇవ్వనంటాడు. ‘తాను కష్టపడి జీవితంలో నిలబడతానని చెల్లెళ్లను తీసుకెళ్లి తన వద్దే ఉంచుకుంటానని అంటాడు.
మీరు బాగా చదివించండని అంటాడు.
కామాంధుల కాటు..
మతిస్థిమితం లేకుండా రోడ్డుపై తిరుగుతున్న ఆమెను 108 అంబులెన్స్‌లో సిబ్బంది జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె అప్పటికే నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు గుర్తించారు. నెలలు నిండే వరకు ఆస్పత్రిలోనే ఉంచి పురుడు పోసారు. పుట్టిన మగ బిడ్డను శిశుగృహకు తరలించారు.
శాపమైన ప్రేమ..
జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆమె ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఓ యువకుడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. మైనారిటీ తీరకుండానే పాప, బా బుకు జన్మనిచ్చింది. తాగుడుకు బానిసైన యువ కుడు నిత్యం శారీరక హింసకు గురిచేయడంతో విడి పోయారు. పిల్లల పోషణకు లావణ్య హోటళ్లలో పనిచేసేది. పని దొరకని నాడు భిక్షాటన తప్పేది కా దు. ఆమె వరంగల్ రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల కంట పడింది. పిల్లలను తను పోషించలేని పరిస్థితిలో ఉన్నా నని స్వచ్ఛందంగా అధికారులకు అప్పగించడంతో వారు పాప, బాబును శిశుగృహకు తరలించారు.
సంతానంలేని దంపతులకు మంచి అవకాశం
సంతానం లేని దంపతులకు పిల్లల దత్తత ప్రభుత్వం కల్పిస్తున్న మంచి అవకాశం. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ లో ‘కార’ వెబ్‌సైట్‌కు దరఖా స్తు చేసుకుని పిల్లలను దత్తత తీసుకోవాలి. దత్తత అప్రూవల్ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ అనుమతితో పిల్లలను దత్తత ఇవ్వడం జరుగుతుంది.
- సుధారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి, నిజామాబాద్
శిశుగృహలో మెనూ..
ఆరు నెలల లోపు పిల్లలకు వైద్యుల సూచన మేరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి పాలు (లాక్టోజిన్ – 1) అందిస్తారు.
ఆరు నుంచి పన్నెండు నెలల లోపు పిల్లలకు రోజుకు రెండు సార్లు ఉగ్గు బాలామృతం, మూడు గంటలకు ఒకసారి (లాక్టోజిన్–2) ఇస్తా రు. వీరికి ప్రత్యేకంగా బాడీ మసాజ్ చేయిస్తారు.
ఏడాది నుంచి మూడేళ్ల లోపు వయస్సు పిల్లల కు ఉదయం పాలు, మెనూ ప్రకారం అల్పాహారం,గుడ్డు,ఇడ్లి, చపాతి, ఉప్మా, అటుకుల ఉప్మా, సేమియా ఉప్మా, నెయ్యి, పెరుగు అందిస్తారు.
మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు మెనూ ప్రకారం ప్రతిరోజు సమతుల్య ఆహారం ఇస్తారు. పిల్లలందరికీ సీజనల్ ఫ్రూట్స్ ఇస్తారు.