న్యూస్‌రీల్
నాగ్‌పూర్–హైదరాబాద్ ఇక దగ్గరే.. అంటూ నితిన్‌గడ్కరీ ప్రకటన జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయరహదారి ఎక్స్‌ప్రెస్‌వేతో తగ్గనున్న ప్రయాణభారం జిల్లాలో పెరగనున్న అభివృద్ధి వేగం
జిల్లా మీదుగా వెళ్తున్న ఎన్‌హెచ్.44
స్కూల్ బస్సుల తనిఖీ
నిర్మల్‌టౌన్: ఆర్టీఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం కూడా ప్రైవేట్ స్కూల్ బస్సుల తనిఖీలు కొనసాగించారు. జిల్లా కేంద్రంలోని బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల లైసెన్సులు, వాహన బీమా, అత్యవసరద్వారాలు తదితర భద్రత ప్రమాణాలను పరిశీలించారు. మొత్తం 10 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎంవీఐ తిరుపతి హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రయాణించే బస్సుల భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తనిఖీల్లో ఆర్టీఏ సిబ్బంది తేజ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్: దేశంలో అతిపెద్ద హైవే ఎన్‌హెచ్–44. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 3,745 కి.మీలతో దేశంలోనే అతి పొడవైన రహదారిగా పేరొందింది. ఈ రహదారి ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఆరులైన్లుగా విస్తరణ జరుగుతోంది దీంతో నాగపూర్–హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం మూడున్నర గంటలకు తగ్గుతుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీంతో జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణలోనూ ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టు పూర్తయితే మధ్యలో ఉన్న జిల్లావాసులకు అటు నాగపూర్, ఇటు హైదరాబాద్‌కు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఈ మార్పు జిల్లా అభివృద్ధికి కూడా కొత్త‘దారులు’ తెరుస్తుంది.
పెరిగిన వాహనాల రద్దీ..
ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే ఎన్‌హెచ్ 44 మొత్తం 11 రాష్ట్రాల గుండా వెళ్తుంది. నిర్మల్ జిల్లాలో ఇదే ప్రధాన రవాణా మార్గంగా ఉంది. ఈ మధ్యకాలంలో విపరీతమైన వాహన రద్దీతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాలను కలిపే ఏకై క రోడ్డుమార్గం కావడంతో భారీ లారీలు, వాహనాలు వెళ్తున్నాయి. వీటి కారణంగా ప్రయాణికులకు ఎక్కువ సమయం తీసుకుంటోంది. తరచూ ప్రమాదాలూ జరుగుతున్నాయి.
ఆరు లేదా ఎనిమిది లైన్లు..
మామూలు హైవేకు ఎక్స్‌ప్రెస్‌వేకు తేడా ఉంటుంది. హైవే రోడ్డులో నాలుగులైన్లు ఉంటాయి. దీనిపైకి ఎక్కడి నుంచైనా రావడానికి వీలుంటుంది. వీటిపై వేగం గరిష్టంగా గంటకు 80 నుంచి 100 కి.మీలు మాత్రమే ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌వేలో చాలా మార్పులు ఉంటాయి. ఇందులో ఆరు నుంచి ఎనిమిది లైన్లు ఉంటాయి. ప్రస్తుతం నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేలలో చాలా కిలోమీటర్ల వరకు మధ్యలో రావడానికి, వెళ్లడానికి అవకాశం ఉండదు. గరిష్ట వేగం గంటకు 120 కి.మీ ఉంటుంది. ఈకారణంగా దూరం, సమయం రెండూ తగ్గుతాయి. ఇటీవల నిర్మల్ సమీపంలోని కడ్తాల్, కామారెడ్డి సమీపంలో నిర్మించిన ఫ్‌లైఓవర్లు ఈ ఎక్స్‌ప్రెస్‌వేలకు అనుగుణంగానే ఆరులైన్లతో నిర్మించారు.
అవకాశం ఉంది..
సులభమైన, వేగవంతమైన ప్రయాణానికి 44వ జాతీయ రహదారిని ఎక్స్‌ప్రెస్‌వేగా మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కేంద్రం ఈమేరకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో కూడా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అధికారికంగా సమాచారం అందలేదు.
– నాగేశ్వర్‌రావు, ఎన్‌హెచ్–44 పీడీ
ఎన్నో లాభాలు..
జిల్లా మీదుగా వెళ్తున్న 44 హైవే కేవలం నాలుగులైన్లు మాత్రమే ఉంది. దీనిని ఆరు లైన్లుగా విస్తరిస్తే తప్ప ప్రమాదాలు, ప్రయాణభారం తగ్గదని చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఈక్రమంలో తాజాగా కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో ఈ హైవే కూడా ఎక్స్‌ప్రెస్‌వేగా మారనుందని స్పష్టమైంది. దీంతో ప్రయాణం వేగవంతం అవుతుంది. ఎక్స్‌ప్రెస్‌వే పొడవునా పరిశ్రమలు, లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటు, వాణిజ్య కార్యకలాపాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిర్మల్ వంటి ప్రాంతాలూ పెట్టుబడిదారులను ఆకర్షించే కేంద్రంగా మారుతాయి. పర్యాటకరంగానికీ ఊతం లభిస్తుంది. దూరప్రాంతాల వారికి జిల్లాలోని ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు చేరుకోవడం సులభమవుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు వాణిజ్య సముదాయాలు వంటి సేవా, ఉపాధిరంగం అభివృద్ధికి ఊతమిస్తుంది. హైదరాబాద్, నాగపూర్ మార్కెట్లతో జిల్లా అనుసంధానం మరింత బలపడే అవకాశం ఉంటుంది. కొత్త పరిశ్రమలు, సేవా కేంద్రాలు, వాణిజ్య సంస్థలు ఏర్పడితే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలూ పెరుగుతాయి.


