అటు ఏనుగు, ఇటు ఎలుగు బంటి | Wild Animals in Trouble | Sakshi
Sakshi News home page

అటు ఏనుగు, ఇటు ఎలుగు బంటి

May 24 2021 8:56 PM | Updated on May 24 2021 9:03 PM

Wild Animals in Trouble - Sakshi

బెంగళూరు: నాగరికత పెరిగిపోవడంతో రానురాను అడవులు, మనుషులకు మధ్య దూరం తగ్గిపోతోంది. దీంతో జనావాసల్లోకి వస్తున్న అడవి జంతువులు ఇబ్బందులు పడుతున్నాయి. మనుషుల మనుగడ కోసం చేసుకున్న ఏర్పాట్లలో చిక్కకుని విలవిలాడుతున్నాయి. ఉపయోగంలో లేని వాటర్‌ ట్యాంక్‌లో చిక్కకుని ఒక గున్న ఏనుగు బయట పడేందుకు ఇబ్బంది పడింది. వెంటనే గమనించిన ఫారెస్టు సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి ఆ ఏనుగును కాపాడారు.  ఏనుగు రెస్క్యూ ఆపరేషన్‌ వీడియోని  కర్నాటకకు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కస్వాన్‌ షేర్‌ చేశారు.  మరోవైపు  ఓ గ్రామానికి సమీపంలోకి వచ్చిన ఎలుగుబంటి అక్కడున్న టబ్‌లో ఏంచక్కా ఎంజాయ్‌ చేసింది. తనివితీరా బాత్‌టబ్‌ చేసింది. ఈ రెండు వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement