సుశాంత్ తండ్రిని క‌లిసిన కేంద్ర మంత్రి

Union Minister Ramdas Athawale Meets Sushants Father KK Singh - Sakshi

ఛండీగ‌డ్ :  బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రిని కేంద్ర‌మంత్రి రాందాస్ అథవాలే ప‌రామ‌ర్శించారు. హ‌ర్యానాలోని ఫ‌రిదాబాద్‌లో సుశాంత్ తండ్రి కేకె సింగ్, సోద‌రి రాణిసింగ్‌తో మంత్రి ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా సుశాంత్‌కు న్యాయం జ‌రుగుతుందని, నిజ‌నిజాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డుతాయ‌ని ధైర్యం చెప్పారు ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ జూన్ 14న మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తిపై  శుక్రవారం సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సుశాంత్ బ్యాంకు ఖాతాలోని డబ్బులను పెద్ద మొత్తంలో మళ్లించారన్న సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ బిహార్‌ పోలీసులకు ఇచ్చిన కేసు ఆధారంగా మేరకు సీబీఐ విచారణ కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. (సుశాంత్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారా?)

అయితే కేసు విచార‌ణలో త‌న‌తో పాటు త‌న కుటుంబం స‌హ‌క‌రిస్తున్నా సోష‌ల్ ట్రోలింగ్‌తో త‌మ‌ను మాన‌సికంగా ఇబ్బందికి గురిచేస్తున్నార‌ని రియా చ‌క్ర‌వ‌ర్తి ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా రియా సోష‌ల్ మీడియా వేదిక‌గా  'నా కుటుంబ స‌భ్యుల జీవితం ప్ర‌మాదంలో ఉంది. త‌మ‌కు  ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని పోలీసులను, ద‌ర్యాప్తు అధికారుల‌ను కోరాము. ఎవ‌రూ మాకు సాయం చేయ‌లేదు. మేము ఎలా ముందుకువెళ్లాలి?  కేవ‌లం విచార‌ణ‌కు వెళ్లేందుకు మాకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని అడుగుతున్నాం. ఈ విష‌యంలో మాకు ఎలాగైనా సాయం చేయాల‌ని ముంబై పోలీసుల‌ను అభ్య‌ర్థిస్తున్నా' అని పేర్కొంది. (ద‌య‌చేసి సాయం చేయండి: రియా చ‌క్ర‌వ‌ర్తి )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top