ఆర్యన్‌ని జైల్లో పెట్టొద్దు! సమీర్‌ వాంఖడేని వేడుకున్నట్లు స్క్రీన్‌ షాట్‌లు

SRK In Alleged Chat With Officer Who Arrested Aryan - Sakshi

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు షారూఖ్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టులో సీనియర్‌ ఆఫీసర్‌గా పేరొందిన నార్కోటిక్స్‌ మాజీ అధికారి సమీర్‌ వాంఖడే అక్రమంగా వ్యవహరించారంటూ సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సీబీఐ ఆయన తోపాటు మరికొందరూ షారూఖ్‌ ఖాన్‌ కుటుంబాన్ని డబ్బులు డిమాండ్‌ చేశారని ఆరోపణలు చేస్తోంది. సీబీఐ పెట్టిన కేసుల విషయమై ముంబై హైకోర్టు ఆశ్రయించిన సమీర్‌ వాంఖడే శుక్రవారం తనకు షారుక్‌ ఖాన్‌కి మధ్య జరిగిన చాట్‌ల సంభాషణను కోర్టుకి సమర్పించారు.

అంతేగాదు షారూఖ్‌ తన కొడుకుని విడిపించమని వేడుకుంటూ జరిగిన సుదీర్ఘ చాట్‌ సంభాషణ గురించి పిటిషన్‌లో పేర్కొన్నాడు వాంఖడే. ఆ స్క్రీన్‌ షాట్‌లో దయ చేసి అతన్ని జైల్లో పెట్టోద్దు. మిమ్మల్ని వేడుకుంటున్నా. మీరు నా కుటుంబంపై దయచూపాలి. నా కొడుకుని కరుడుగట్టిన నేరస్తుడిలా జైల్లో ఉండటానికి అర్హుడు కాదు. అది అతడి ఆత్మవిస్వాశాన్ని దెబ్బతీస్తుంది. ఒక తండ్రిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ కేసు ఉపసంహరించుకునేలా నా శక్తిమేర చేయల్సిదంతా చేస్తానని మీకు హామి ఇస్తున్నా. దయచేసి నా కొడుకుని ఇంటికి పంపించండి. అని షారూక్‌ తనకు వాట్సాప్‌ మెసేజ్‌లు చేశారని సమీర్‌ వాంఖడే ఆరోపించారు.

అందుకు సమీర్‌ సమాధానంగా షారూక్‌ నువ్వొక మంచి మనిషిగా నాకు నీ గురించి తెలుసు. నేను జోనల్‌ డైరెక్టర్‌. సమాజాన్ని, పిల్లల జీవితాలన్ని కలుషితం చేస్తున్న వాటిని ప్రక్షాళ చేసే సర్వీస్‌ చేస్తున్నాను. కానీ కొందరూ నా ప్రయత్నాన్ని దుర్మార్గంగానూ, స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నట్లుగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వాంఖడే స్రీన్‌షాట్‌ మెసేజ్‌లో పేర్కొన్నట్లు ఉంది. ఇదిలా ఉండగా, హైకోర్టులో సమీర్‌ వాంఖడేకు ఊరట లభించింది. మే 22 దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని శుక్రవారం హైకోర్టు ఆదోశిచింది. కాగా, వాంఖడే తన కుటుంబంతో కలిసి పలుమార్లు విదేశాలకు వెళ్లాడని, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఎన్సీబీ నివేదిక పేర్కొనడం గమనార్హం. 

(చదవండి: సిన్సియర్‌ సమీర్‌ వాంఖడే.. రోలెక్స్‌ వాచీ, ఫారిన్‌ ట్రిప్పులు, కోట్లు విలువ చేసే ప్లాట్‌లు?!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top