
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా గుజరాత్ కేడర్‌కు చెందిన రాకేశ్ ఆస్తానా బుధవారం నియమితులయ్యారు. నియామకానికి సంబంధించిన ఆదేశాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలను అదుపులో ఉంచడం, నేరలు జరకుండా చూడడం పోలీసుల ప్రాథమిక విధి అని, అది తనకు తెలుసని పేర్కొన్నారు. ఈ రెండు పనులు చేస్తే సమాజంలో శాంతి నెలకొంటుందని తెలిపారు.
1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆస్తానా గతంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా, బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. అరుణాచల్ ప్రదేశ్– గోవా– మిజోరం– యూనియన్ టెర్రిటరీ కేడర్‌కు చెందని ఐపీఎస్ అధికారిని ఢిల్లీ కమిషనర్‌గా నియమించడం అత్యంత అరుదు కావడం గమనార్హం.