ప్రధాని మోదీ జీ.. అప్పుడిచ్చిన హామీ ఏమైంది?

Questions Over Modi Guarantee On Black Money - Sakshi

శతమానం భారతి.. లక్ష్యం 2047

విదేశాలలో మన నల్లధనం గుట్టలకొద్దీ మూలుగుతోందని, అదంతా తెచ్చి దేశ పౌరుల ఖాతాల్లో వేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పెద్ద నోట్ల రద్దుకు ముందు.. చెప్పారు. పెద్ద నోట్లు రద్దయ్యాయి కానీ, అకౌంట్‌లలో చిన్నమొత్తమైనా వచ్చి పడలేదు. ఎక్కడి నల్ల ధనం అక్కడే ఉండిపోతే ఎలా పడుతుంది.

పన్నుల ఎగవేత, అవినీతి, గుప్తధనం అక్రమ రవాణా, నేర కార్యకలాపాలు, దొంగ రవాణా.. వీటివల్ల నల్లధనం జమ అవుతూ ఉంటుంది. 1956లో మన నల్ల ధనం దేశ జీడీపీలో 4.5 శాతం ఉండగా, 1980–83 మధ్య ఇది 18 నుంచి 21 శాతానికి పెరిగింది. 2012లో భారత్‌లో మొత్తం నల్లధనం పరిమాణం రూ.63 లక్షల కోట్లని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ అరుణ్‌ కుమార్‌ అధ్యయనంలో వెల్లడయింది.

అవినీతి నిరోధక చట్టం (1988), బినామీ లావాదేవీల చట్టం (1988), అక్రమ ధన చలామణి  నిరోధక చట్టం (2002), లోక్‌పాల్, లోకాయుక్త చట్టాలు, ఆఖరికి పెద్ద నోట్ల రద్దు కూడా నల్లధన వ్యాప్తిని నిరోధించలేక పోయాయి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ‘అనుబంధం’ నల్లధనం ఉత్పత్తికి ప్రధాన కారణంగా చెబుతున్న సామాజిక అభివృద్ధి అధ్యయనవేత్తలు.. మరో ఇరవై ఐదేళ్లకైనా నల్లధనం ఉత్పత్తి, విస్తృతి తగ్గితే గొప్ప సంగతేనని అంటున్నారు. 2020లో న్యూజిలాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, సింగపూర్, నార్వే.. అతి తక్కువ అవినీతి గల దేశాలుగా నిలిచాయి.
ఇది కూడా చదవండి: ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top