వీడియో: మళ్లీ భద్రతా వైఫల్యం.. ప్రధాని మోదీ కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన వ్యక్తి

PM security breach Again: Man runs to Modi convoy in Karnataka - Sakshi

బెంగళూరు:  ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగు చూసింది.  తాజాగా కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌కు ఎదురొచ్చే యత్నం చేశాడు ఓ యువకుడు. అయితే.. అది గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

కర్ణాటకలో వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునా.. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పర్యటించారు. ఈ క్రమంలో.. దావణగెరెలో ప్రధాని మోదీ ఇవాళ రోడ్‌షో నిర్వహించారు. అయితే ఆ సమయంలో ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ వాహనంలో ముందుకు కదిలారు. ఆ సమయంలో బారికేడ్లను దూకేసిన ఓ యువకుడు ప్రధాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ వైపు అకస్మాత్తుగా దూసుకొచ్చే యత్నం చేశాడు. అది గమనించిన స్థానిక పోలీసులు, పీఎం సెక్యూరిటీ సిబ్బంది.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  సదరు యువకుడిది కొప్పాల్‌ అని, అతడు బీజేపీ కార్యకర్తగానే గుర్తించారు పోలీసులు. 

ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ పర్యటనలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇదే కర్ణాటకలో హుబ్బళి వద్ద ప్రధాని మోదీ రోడ్‌షోలో.. ఇలాగే ఓ వ్యక్తి దూసుకొచ్చే యత్నం చేయగా, పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top