Supreme Court: న్యాయమూర్తులకు నైతికతే కీలకం

 New Delhi: Supreme Court Comments Over Professional Ethics   - Sakshi

న్యూఢిల్లీ: సమాజంలో న్యాయమూర్తులు అత్యున్నత నైతిక స్థలాన్ని ఆక్రమిస్తారని, న్యాయ కల్పనపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో వీరు ఎంతదూరమైనా వెళ్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏస్థాయిలోని న్యాయమూర్తైనా అత్యున్నత ప్రమాణాలను ఆచరించాలని తెలిపింది. సివిల్‌ జడ్జిగా నియమించేందుకు తాను అనర్హుడినంటూ రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు.

దీన్ని విచారించిన కోర్టు న్యాయమూర్తి, నైతికతపై వ్యాఖ్యలు చేసింది. పిటీషనర్‌పై కొన్ని ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైనట్లు, కొన్నికేసుల్లో రాజీ కుదుర్చుకున్నట్లు  గమనించామని కోర్టు తెలిపింది. ఏ కేసులో శిక్ష పడనందున ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను పక్కనబెడుతున్నట్లు తెలిపింది. సివిల్‌ జడ్జి పోస్టుకు సరైనవారిని ఎంపిక చేయడం హైకోర్టు బాధ్యతని, కానీ ఈ సందర్భంలో హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది.   

చదవండి: ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్‌ దాస్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top