Watch: Man Proposes His Girlfriend Mid-Air On Air India Flight To Mumbai, Video Viral - Sakshi
Sakshi News home page

Viral Video: విమానంలో అందరిముందే ప్రియురాలికి లవ్‌ ప్రపోజ్‌.. ఆమె రియాక్షన్‌ ఇదే

Jan 12 2023 12:46 PM | Updated on Jan 12 2023 3:37 PM

Man Surprises Girlfriend On Flight, Proposes Mid Air Video Goes Viral - Sakshi

ప్రేమ అనేది ఒక మధురానుభూతి. రెండు జీవితాలను ఒక్కటి చేస్తుంది. ప్రేమలో పడిన వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏదో ఒక సమయంలో అయినా ఎవరో ఒకరి మనసును దోచుకునే ఉంటారు.  లవ్‌లో పడటం సహజమే. కానీ, ఆ ప్రేమను వ్యక్తపరచడం మాత్రం అంత తేలికైన వ్యవహారం కాదు. మన ప్రేమను అంగీకరిస్తారా.ఛీ కొడతారా అనే టెన్షన్‌ మనుసును మెలిపెడుతుంటుంది. అందుకే ప్రపోజ్‌ చేయడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు.  ఈ మధ్య కాలంలో చాలా మంది ఢిఫరెంట్‌ పద్దతుల్లో తమ చెలికి మనసులో మాటను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

తాజాగా ఓ వ్యక్తి కూడా ఇలాంటి ఆలోచనే చేశాడు. ఏకంగా విమానంలో ప్రియురాలికి లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. వివరాలు.. జనవరి రెండో తేదిన ఓ యువతి ముంబైకు విమానంలో ప్రయాణించింది. ఆమె ఎయిర్‌ ఇండియాలో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్న ప్రియుడు కూడా అదే విమానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. తన ప్రేయసికి వినూత్నంగా ప్రపోజ్‌ చేయాలని భావించి ఇందుకు విమాన సిబ్బంది సాయం కోరాడు. విమానం టేకాఫ్‌ అయ్యాక ఓ చార్ట్‌ పట్టుకొని మెల్లగా ప్రియురాలు కూర్చున్న సీట్‌ వద్దకు వచ్చాడు.
చదవండి: ప్రేమలో పడ్డారు సరే, ‘831 224’ అని ఎప్పుడైనా ప్రపోజ్‌ చేశారా?

ఆమె దగ్గరకు చేరుకున్న తర్వాత ఫేస్‌ మాస్క్‌ తీసి నవ్వాడు. ఊహించని సర్‌ప్రైజ్‌తో షాక్‌ అయిన యువతి అసలు ఏం జరుగుతుందో నమ్మలేకపోతుంది. అతడు కొన్ని ఫోటోలతోపాటు ‘నేను ఎప్పటికీ నీతో జీవించాలనుకుంటున్నాను.. నువ్వు కూడా నాతో కలిసి జీవిస్తావా’ అని రాసి ఉన్న చార్ట్‌ను ఆమెకు చూపించాడు. అది చూసిన యువతి ఆశ్చర్యపోతుంది. వెంటనే తన సీట్‌ నుంచి లేచి యువతి ముందుకు రావడంతో ఆ వ్యక్తి తన మొకాలిపై కూర్చొని వెంట తెచ్చిన బాక్స్‌ నుంచి రింగ్‌ తీసి ప్రపోజ్‌ చేశాడు. ఆమె కూడా ఆనందంతో ఆ వ్యక్తిని కౌగిలించుకొని అతని చెంపై ముద్దు పెట్టింది. విమానంలోని మిగతా ప్రయాణికులు చప్పట్లతో ఈ జంటను అభినందించారు.

ఇక దీన్నంతటిని తోటి ప్రయాణికుడు వీడియో తీశాడు. ఈ వీడియోను రమేష్‌ కొట్నానా అనే వ్యక్తి లింక్డ్‌ఇన్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇది నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది. ‘చూడచక్కని జంట.. ఎంతో అద్భుతంగా ప్రపోజ్‌ చేశాడు.. నిజమైన ప్రేమ’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఎయిర్ ఇండియా తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే విమానాల్లో మూత్ర విసర్జన సంఘటనలు చోటుచేసుకున్న తరుణంలో ఈ వీడియో క్లిప్‌ వెలుగు చూడటం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement