ఖైదీతో మహిళా జైలర్ ప్రేమ పెళ్లి.. ఎన్ని ట్విస్ట్‌లో.. | Jailer Fell In Love In Satna Jail: Vhp Bajrang Dal Got Them Married | Sakshi
Sakshi News home page

ఖైదీతో మహిళా జైలర్ ప్రేమ పెళ్లి.. ఎన్ని ట్విస్ట్‌లో..

May 8 2026 3:19 PM | Updated on May 8 2026 3:47 PM

Jailer Fell In Love In Satna Jail: Vhp Bajrang Dal Got Them Married

సత్నా: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సత్నాలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. హత్య కేసులో జైలులో ఉన్న ఖైదీతో మహిళా జైలర్ ప్రేమాయణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సత్నా సెంట్రల్ జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఫిరోజా ఖాతూన్.. జైలులో వారెంట్ ఇన్‌చార్జ్‌గా ఉన్న సమయంలో ధర్మేంద్ర సింగ్ పరిచయమయ్యారు.

ధర్మేంద్ర సింగ్ 2007లో ఒక కౌన్సిలర్‌ను హత్య చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. జైలులో వారెంట్లకు సంబంధించిన పనుల్లో జైలు అధికారులకు ధర్మేంద్ర సహాయం చేసేవారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారి.. చివరికి ప్రేమగా చిగురించింది. ధర్మేంద్ర సింగ్ తన 14 ఏళ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని.. సత్ప్రవర్తన కారణంగా నాలుగేళ్ల క్రితం జైలు నుండి విడుదలయ్యారు. బెయిల్‌పై విడుదలయ్యాక కూడా ధర్మేంద్రను తరుచుగా కలుస్తూ.. అతడినే పెళ్లి చేసుకుంటానని తన కుటుంబానికి ఫిరోజా ఖాతున్ తేల్చిచెప్పింది.

పెళ్లికి తన కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా ధర్మేంద్రను హిందూ సంప్రదాయం ప్రకారం ఆ మహిళా అధికారి పెళ్లి చేసుకుంది. మే 5వ తేదీన ఛతర్‌పూర్ జిల్లాలో వీరి వివాహం జరిగింది. ధర్మేంద్రను హిందూ సంప్రదాయం ప్రకారం ఆ మహిళా అధికారి పెళ్లి చేసుకుంది. బజరంగ్ దళ్ సభ్యులు ఆ మహిళకు కన్యాదానం చేశారు. ఒక మహిళా జైలు అధికారిణి.. మాజీ ఖైదీ మధ్య జరిగిన ఈ వివాహం ఇప్పుడు వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement