Gen Bipin Rawat Chopper Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే మంటలు చెలరేగుతూ..’

Gen Bipin Rawat Chopper Crash: Eye Witness At The Crash Site Tamilnadu - Sakshi

భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం కుప్పకూలింది. కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన హెలికాఫ్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ఉన్నట్టు భారతీయ వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ప్రమాద స్థలాన్ని మొదట చూసిన ప్రత్యక్ష సాక్షి కృష్ణస్వామి కథనం ప్రకారం.. ఆ పరిసరాల్లో తాను ఉండగా హఠాత్తుగా పెద్ద శబ్దం వచ్చిందని, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి శబ్దం విన్న ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపాడు.

అక్కడ చూడగా.. ఓ చాపర్‌ చెట్టును ఢీ కొట్టి, మంటలు చెలరేగాయని తెలిపాడు. అదే క్రమంలో హెలికాప్టర్‌ మరో చెట్టును ఢీ కొట్టడం కళ్లారా చూశానని తెలిపాడు.  ఈ ఘటనలో హెలికాప్టర్ నుంచి అనేక మృతదేహాలు పడిపోవడం తాను చూశానని అతను చెప్పాడు. ఏం జరుగుతుందో అర్థంకాక తాను ఇరుగుపొరుగు వారితో పాటు అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. కాగా,  ప్రమాదం జరిగిన హెలీకాప్టర్‌లో మొత్తం 14మంది ప్రయాణిస్తున్నారని తెలిసింది.

చదవండి: TN Army Helicopter Crash: బ్రేకింగ్‌ న్యూస్‌: కుప్పకూలిన బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌, 11 మంది మృతి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top