‘ట్రాఫిక్‌ కారణంగా విడాకులు తీసుకుంటున్నారు’ | Ex Chief Ministers Wife Says Three Percent Divorces Due To Traffic | Sakshi
Sakshi News home page

‘ట్రాఫిక్‌ కారణంగా విడాకులు తీసుకుంటున్నారు’

Feb 5 2022 2:57 PM | Updated on Feb 5 2022 4:00 PM

Ex Chief Ministers Wife Says Three Percent Divorces Due To Traffic - Sakshi

ట్రాఫిక్‌ కారణంగానే ముంబైలో మూడు శాతం మంది విడాకులు తీసుకుంటున్నారని మహారాష్ట్ర మాజీ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ అన్నారు.

ట్రాఫిక్‌ కారణంగానే ముంబైలో మూడు శాతం మంది విడాకులు తీసుకుంటున్నారని మహారాష్ట్ర మాజీ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ అన్నారు. ఆర్థిక రాజధానిలో రోడ్ల పరిస్థితిని గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విధంగా విచిత్రమైన వాదనను వినిపించారు.  అంతేకాదు తాను దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అనే విషయం మరచిపోండి. ఒక మహిళగా మీతో మాట్లాడుతున్నాను. గుంతలు, ట్రాఫిక్‌తో తాను వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. పైగా ఈ ట్రాఫిక్‌ కారణంగానే కుటుంబంతో గడిపే సమయం లేకపోవడంతో చాలామంది విడాకులు తీసుకుంటున్నారని ఒక విచిత్రమైన లాజిక్‌ని చెప్పారు.

దీంతో శివసేన నాయకురాలు  ప్రియాంక చతుర్వేది ఆమె పేరు ఎత్తకుండానే సోషల్‌ మీడియా వేదికగా ఆమె స్టేట్‌మెంట్‌పై విరుచుకుపడ్డారు. అంతేకాదు ట్రాఫిక్‌ కారణంగా విడాకులు తీసుకుంటున్నారన్న మహిళకు ది బెస్ట్‌ లాజిక్ ఆఫ్ ది డే అవార్డును అందజేయాలంటూ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. అంతేకాదు బెంగుళూరు కుటుంబాలు ఈ స్టేట్‌మెంట్‌ని క్లైయిమ్‌ చేసుకుంటారే ఏమో! జాగ్రత్తా అంటూ ప్రియాంక చతుర్వేది చమత్కరించారు. పైగా విడాకులు తీసుకోవడంపై దృష్టి సారించకుండా కుటుంబంతో గడిపేందుకు హాలీడే బ్రేక్‌ తీసుకోండి అన్నారు. అంతేకాదు దయచేసి ఈ విచిత్రమైన స్టేట్‌మెంట్‌ని అనుకరించకండి మీ వివాహబంధానికి ప్రాణాంతకం కావచ్చు అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలతో విమర్శిస్తూ ప్రియాంక చతుర్వేది ట్వీట్‌ చేశారు.

(చదవండి: నామినేషన్‌ దాఖలు చేసేందుకు పరుగులు పెట్టిన యూపీ క్రీడా మంత్రి)

Advertisement
 
Advertisement
Advertisement