నువ్వు నిజంగా సూపర్‌ బామ్మ! | Elderly Woman Climbs Steep Harihar Fort in Maharashtra | Sakshi
Sakshi News home page

నువ్వు నిజంగా సూపర్‌ బామ్మ!

Oct 12 2020 3:27 PM | Updated on Oct 12 2020 3:27 PM

Elderly Woman Climbs Steep Harihar Fort in Maharashtra - Sakshi

ముంబై: ఏదైనా సాధించాలనే కోరిక ఉండాలే కానీ వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ 70 ఏళ్ల బామ్మ వీడియోను చూస్తే మీరు కూడా తప్పకుండా అది నిజమేనేమో అని అంటారు. ఈ వీడియోలో ఒక మహిళ నాసిక్‌లో ఏటవాలుగా ఉండే హరిహర్‌ కోటను  70 ఏళ్ల వయసులో ఎక్కి చూపించింది.  ఈ వీడియోని చూసిన వారందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ వయసులో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారంటూ కీర్తిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా నిలుస్తోంది. హరిహర్ కోట నాసిక్ లోని ఇగత్పురి నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది రాక్ కట్ మెట్లకు ప్రసిద్ది చెందింది. ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ సుధా రామన్‌ దీనిపై ట్వీట్‌ చేస్తూ ధృడసంకల్పం ఉండటం వలనే ఆమె ఈ వయసులో కూడా అనుకున్నది సాధించగలిగింది అని చెప్పారు. 

చదవండి: బెడిసికొట్టిన రసగుల్లా బిర్యానీ; నెటిజన్ల ఫైర్‌

Advertisement
 
Advertisement
Advertisement