వైద్యుడి బలవన్మరణం.. నర్స్‌ ఆత్మహత్య | Doctor And Nurse Working At Same Hospital Ends Their Lives Within Two Days In Bengaluru, More Details Inside | Sakshi
Sakshi News home page

వైద్యుడి బలవన్మరణం.. నర్స్‌ ఆత్మహత్య

May 9 2026 9:56 AM | Updated on May 9 2026 12:26 PM

Doctor Nurse Ends Life in Kanakapura

బెంగళూరు: ఒకే ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్, నర్స్‌ రెండు రోజుల తేడాలో ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కనకపుర పట్టణంలోని మహదేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. స్థానిక నవోదయ ఆస్పత్రిలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ చేతన్‌ కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇదే ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తున్న సరస్వతి(45) గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ ఈ ఆస్పత్రిలో చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. డాక్టర్‌ మృతిని తట్టుకోలేక సరస్వతి మనోవేదనకు గురై తానూ ఆత్మహత్య చేసుకుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనపై కనకపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement